Share News

లోక్‌అదాలత్‌లో భారీగా కేసుల పరిష్కారం

ABN , Publish Date - Sep 13 , 2026 | 01:03 AM

జాతీ య లోక్‌అదాలత్‌లో భాగంగా పెద్దపల్లి జిల్లాలో వివిధ రకాల కేసులను పరిష్కరించి బాధితులకు భారీగా పరిహారం అందజేసినట్లు జిల్లా జడ్జి కుంచా ల సునీత తెలిపారు. ఈ సందర్భంగా పలు కేసుల గురించి వివరించారు. మోటార్‌ వాహన చట్టానికి సంబంధించిన 6 కేసుల్లో బాధితులకు

లోక్‌అదాలత్‌లో భారీగా కేసుల పరిష్కారం
మట్టి గణపతులను అందజేస్తున్న జడ్జీ

పెద్దపల్లి టౌన్‌ సెప్టెంబర్‌ 12 (ఆంధ్రజ్యోతి): జాతీ య లోక్‌అదాలత్‌లో భాగంగా పెద్దపల్లి జిల్లాలో వివిధ రకాల కేసులను పరిష్కరించి బాధితులకు భారీగా పరిహారం అందజేసినట్లు జిల్లా జడ్జి కుంచా ల సునీత తెలిపారు. ఈ సందర్భంగా పలు కేసుల గురించి వివరించారు. మోటార్‌ వాహన చట్టానికి సంబంధించిన 6 కేసుల్లో బాధితులకు 33 లక్షల 50 వేల రూపాయలు, పరిహారం అందించినట్లు తెలి పారు. క్రిమినల్‌కు సంబంధించిన 260 కేసులు, చెక్‌ బౌన్సు సంబంధించిన 21 కేసులను పరిష్కరించి బాధితులకు 64 లక్షలు అందజేసినట్లు, ఫిక్‌ చలా న్లకు సంబంధించి 13, 519 కేసుల ద్వారా ప్రభు త్వానికి 55 లక్షల, 31 వేల, 805 రూపాయలు చెల్లిం చినట్లు తెలిపారు. 10 సివిల్‌ కేసులు, ప్రోనోట్‌కు సం బంధించిన 4 కేసులను పరిష్కరించి బాధితులకు 19 లక్షల 50 వేల రూపాయలు, 1704 డ్రంక్‌ అండ్‌ డైరవ్‌ కేసులు, 3 బ్యాంక్‌ పీఎల్‌సీ కేసులను కూడా లోక్‌అదాలత్‌ ద్వారా పరిష్కరించినట్లు జడ్జి వెల్లడిం చారు. లోక్‌అదాలత్‌ అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ఆధ్వర్యంలో గాయత్రి స్కూల్‌ పెద్దపల్లి వారు అందజేసిన గణేష్‌ ప్రతిమలను న్యాయవాదులు, పోలీసు సిబ్బంది, కక్షిదారులకు పంపిణీ చేశారు.

సుల్తానాబాద్‌లో..

సుల్తానాబాద్‌: రాజీ మార్గమే రాజమార్గం అని, లోక్‌ అదాలత్‌లతో ఇరు వర్గాలకు సమ న్యాయం అం దుతుందని జూనియర్‌ సివిల్‌ జడ్జి దుర్గం గణేశ్‌ అన్నారు. శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ సంద ర్భంగా మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వ ర్యంలో స్థానిక కోర్టు ఆవరణలో లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి గణేష్‌ మాట్లా డుతూ లోక్‌ అదాలత్‌లలో ఇరు పక్షాల అంగీకారంతో రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకోవచ్చని అన్నారు. లోక్‌ అదాలత్‌ తీర్పులపై ఎలాంటి అప్పీలు ఉండదని తెలిపారు. ఈ లోక్‌ అదాలత్‌లో పలు క్రిమి నల్‌ కేసులు, కుటుంబ వివాదాలు, భూమి తగాదా లు, చెక్‌బౌన్స్‌, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులకు సంబం ధించి దాదాపు 1,210 కేసులు పరిష్కారం అయ్యా యని కోర్టు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వోడ్నాల రవీందర్‌, ఏజీపీ దూడం ఆంజనేయులు, సెంకడ్‌ క్లాస్‌ మెజి స్ట్రేట్‌ నేరెళ్ల శంకరయ్య,, బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు ఆవుల శివకృష్ణ, సంయుక్త కార్యదర్శి గుడ్ల వెంకటేష్‌లతో పాటు పలువురు న్యాయ వాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

మంథనిలో..

మంథని: పరస్పర అంగీకారంతో కేసులు పరిష్కరించుకోవాలని మంథని సీనియర్‌ సివిల్‌ జడ్జి అపర్ణ మల్లాది అన్నారు. స్థానిక కోర్టు ఆవరణలో జాతీయ మెగాలోక్‌ ఆదాలత్‌ను శనివారం నిర్వహిం చారు. ఇందులో వివిధ కోర్టుల పరిధిలోని 274 కేసు లను రాజీమార్గంలో పరిష్కరించారు. ఈసందర్భంగా జడ్జి అపర్ణ మల్లాది మాట్లాడుతూ.. రాజీ మార్గంలో కేసులు త్వరితగతిన పరిష్కరించుకోవడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవచ్చన్నారు. ఈకార్యక్రమం లో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ఆర సుధారాణి, ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి అనురాధ, ఏపీపీ అర్థ కుమార్‌, ఏజీపీ అంజనేయులు, న్యాయవాదులు కేతి రెడ్డి రఘోత్తంరెడ్డి, సువర్ణ చంద్రశేఖర్‌, శశిభూషణ్‌ కాచే, కటకం శ్రీనివాస్‌, అశోక్‌రెడ్డి, వ్యాస్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2026 | 01:03 AM