Share News

భూ రీసర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

ABN , Publish Date - Sep 07 , 2026 | 11:30 PM

భూముల రీ స ర్వే ప్రక్రియను ఎలాంటి లోపా లకు తావు లేకుండా నిర్వహించి నిర్దేశిత గడువులో పూర్తి చేయా లని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పా టిల్‌ అధికారులను ఆదేశించారు.

భూ రీసర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
వెంకటాపూర్‌ గ్రామంలో కొనసాగుతున్న భూ రీ సర్వే పనులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

- కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

నాగర్‌కర్నూల్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : భూముల రీ స ర్వే ప్రక్రియను ఎలాంటి లోపా లకు తావు లేకుండా నిర్వహించి నిర్దేశిత గడువులో పూర్తి చేయా లని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పా టిల్‌ అధికారులను ఆదేశించారు. నాగర్‌కర్నూల్‌ మండల పరిధిలో ని వెంకటాపూర్‌ గ్రామంలో కొన సాగుతున్న భూముల రీ సర్వే ప్ర క్రియను సోమవారం కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో ప రిశీలించారు. ఇప్పటి వరకు చేపట్టిన సర్వే వి వరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ మాట్లాడుతూ సర్వే సమయంలో భూముల విస్తీర్ణం, సర్వే నెం బర్లు, గ్రామ సరిహద్దులు, గ్రామ కంఠం తది తర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధి త రికార్డులతో సరిపోల్చాలని సూచించారు. అ దేవిధంగా గ్రామంలో కొనసాగుతున్న సర్‌ ప్ర క్రియను కలెక్టర్‌ పరిశీలించారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ తబితారాణి, ఏడీ సర్వే అండ్‌ ల్యాం డ్‌ రికార్డ్సు గిరిధర్‌, డిప్యూటీ సర్వేయర్‌ లైసెన్డ్‌ సర్వేయర్లు ఉన్నారు.

ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్క రించాలని, అలాగే వసతి గృహాలను క్షేత్రస్థాయి లో పరిశీలించాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పా టిల్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అద నపు కలెక్టర్‌ చెన్నయ్య, డీఆర్వో పాండుతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనా ర్టీ సంక్షేమ శాఖల వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలలను అధికారులు ప్రతీ సోమవా రం క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. ప్ర జావాణికి 50 వినతులు వచ్చాయి. శాఖల అఽధికారులు పాల్గొన్నారు.

పకడ్బందీగా ఎస్‌ఐఆర్‌

జిల్లాలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పకడ్బందీగా కొ నసాగుతోందని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటి ల్‌ అన్నారు. హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి సోమవారం జి ల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై సమీక్షించారు. నాగర్‌క ర్నూల్‌ సబ్‌ కలెక్టరేట్‌ సలోని చాబ్ర, అదనపు కలెక్టర్‌ బి.చ్నెయ్య, ఆర్డీవోలతో కలిసి జిల్లా కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడు తూ నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కొల్లాపూర్‌ ని యోజకవర్గాల్లో మొత్తం 1,15,824మంది ఓట ర్లకు నోటీసులు జనరేట్‌ చేసి, ఇప్పటి వరకు 1,13,996 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసి నట్లు వివరించారు. ఈ సమావేశంలో నాగర్‌క ర్నూల్‌ ఆర్డీవో అర్చన, కలెక్టరేట్‌ ఎన్నికల విభా గం సూపరింటెండెంట్‌ రవికుమార్‌, ఎన్నికల డీటీ కల్పన పాల్గొన్నారు.

Updated Date - Sep 07 , 2026 | 11:31 PM