భూముల రీసర్వేను వేగంగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Oct 13 , 2026 | 11:32 PM
తండా శివారు లో కొనసాగుతున్న భూముల రీ సర్వే పనులు వేగవంతంగా పూర్తి చేయాలని నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజనల్ అధికారి అ ర్చన సూచించారు.
- రెవెన్యూ డివిజనల్ అధికారి అర్చన
తిమ్మాజిపేట, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి) : తండా శివారు లో కొనసాగుతున్న భూముల రీ సర్వే పనులు వేగవంతంగా పూర్తి చేయాలని నాగర్‌కర్నూల్ రెవెన్యూ డివిజనల్ అధికారి అ ర్చన సూచించారు. తిమ్మాజిపే ట మండల పరిధిలోని హేమ్లా నాయక్‌తండా గ్రామ పంచాయ తీ పుట్నాలతండా శివారులో కొన సాగుతున్న రీ సర్వే పనులను మంగళవారం ఆమె పరిశీలించి పనుల పురోగ తిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసు కున్నారు. సర్వేలు ఎలాంటి తప్పులు జరగకుం డా చూడాలని రైతు లకు ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా నిర్వ హించాలని ఆమె అన్నారు. భూమి యజమా నుల సమక్షంలోనే హద్దులు నిర్వహించాలని ఎక్కడైనా వివాదాలు ఉంటే అ క్కడే పరిష్కరిం చేలా చర్యలు తీసుకోవాలన్నా రు. రైతులకు ఎలాంటి అనుమానాలున్నా అధి కారులు వెంటనే సమస్య పరిష్కరించాలని కో రారు. సర్పంచ్ కృష్ణకుమార్, మండల సర్వేయ ర్ సాయిబాబా, గిర్దావర్ అనురాధ, జీపీవో రాజు, వెంకటయ్య పాల్గొన్నారు.