రీ సర్వేతో భూ సమస్యలకు చెల్లు
ABN , Publish Date - Jul 02 , 2026 | 11:01 PM
భూముల రీ సర్వేతో భూ సమస్యలు ఇక చెల్లు అవుతాయని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. గురువారం మం డలంలోని మద్దికల్ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.
కలెక్టర్ కుమార్ దీపక్
భీమారం, జూలై 2 (ఆంధ్రజ్యోతి) : భూముల రీ సర్వేతో భూ సమస్యలు ఇక చెల్లు అవుతాయని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. గురువారం మం డలంలోని మద్దికల్ గ్రామంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ఏళ్ల తరబడి మోకాపై సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రైతులకు ప్రభుత్వం లబ్ది చేకూర్చనుందని, అక్రమంగా పట్టాలు పొంది ప్ర భుత్వ సంక్షేమ ఫలాలు పొందుతున్న వారికి ఇకపైన రద్దయ్యేలా చర్యలు చే పడతామని, నిజమైన రైతులకు న్యాయం చేస్తామన్నారు. భూ భారతి రెవె న్యూ సదస్సుల్లో వచ్చిన భూ సంబంధిత దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీ లించి రికార్డులను చూసి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రికార్డులు, మోకా, పట్టాదారుల వివరాలు ఇతర అంశాలను పరిగనలోకి తీసుకుని ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మొదటగా గ్రామంలోని భూములకు సంబంధించి హద్దులు నిర్ధారిస్తామని, తద్వారా గ్రామానికి సంబంధించిన భూమిస్పష్టత వస్తుందని, ప్రభుత్వ భూముల సైతం నిర్ధారణ అవుతాయన్నారు. పట్టా కలిగి ఉండి మోకాపై లేకపోవడం, మోకాపై ఉండి పట్టా కలిగి ఉండకపోవడం అంశాలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ భూములు ఆక్ర మిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సర్వేయర్లు, ప్రజల సహకారంతో సమస్యల పరిష్కారం వేగవంతం అవుతుందన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించి తరగతి గదులు, వంటశాల, రిజిష్టర్‌లు, పరిసరాలను పరిశీలించి పలు సూచనలు చేశారు. మెను ప్రకారం పౌష్టికాహారం , శుద్దమైన తాగునీరు అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రజిత, జీపీవో ఓంకార్, సర్పంచు పోతం సమ్మయ్య, నాయకులు మహేశ్వర్‌రెడ్డి, గ్రామస్థులు, రైతులు పాల్గొన్నారు.