Share News

భూమి ఓచోట...రిజిస్ట్రేషన్లు మరోచోట...!

ABN , Publish Date - Aug 29 , 2026 | 11:36 PM

జిల్లా కేం ద్రంలోని కోట్లాది రూపాయల విలువజేసే ఎకరాల కొద్దీ సర్కారు భూములను ’రియల్‌’ గద్దలు చెరబడుతు న్నా యి. తప్పుడు సర్వే నెంబర్లతో వెంచర్లుగా మార్చి, సా మాన్యులకు విక్రయిస్తూ డబ్బు మూటలు ఎగరేసు కు పోతున్నాయి.

భూమి ఓచోట...రిజిస్ట్రేషన్లు మరోచోట...!

-పట్టా భూమి నెంబరుతో ప్రభుత్వ భూమి విక్రయం

-మునిసిపల్‌ కార్పొరేషన్‌లో 3.20 ఎకరాలు అన్యాక్రాంతం

-యథేశ్ఛగా ప్లాట్లు చేసి అమ్ముతున్నా పట్టని అధికారులు

-తోళ్లవాగు సమీపంలో అక్రమంగా వెలసిన రోడ్డు, ప్లాట్లు

-స్థల పరిశీలన జరుపకుండానే నిర్మాణ అనుమతులు జారీ...?

మంచిర్యాల, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేం ద్రంలోని కోట్లాది రూపాయల విలువజేసే ఎకరాల కొద్దీ సర్కారు భూములను ’రియల్‌’ గద్దలు చెరబడుతు న్నా యి. తప్పుడు సర్వే నెంబర్లతో వెంచర్లుగా మార్చి, సా మాన్యులకు విక్రయిస్తూ డబ్బు మూటలు ఎగరేసు కు పోతున్నాయి. కొందరు చోటా మోటా నాయకులు త మకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని పట్టా భూ ముల సర్వే నెంబర్‌ వేస్తూ...ఏకంగా ప్రభుత్వ భూమిలో ప్లా ట్లు విక్రయిస్తున్నారు. గర్మిళ్ల శివారులోని తోళ్లవాగు స మీపంలో సర్వే నెంబర్‌ 356లోని ప్రభుత్వ భూమిని ఆ క్రమించి, అమ్మకానికి పెట్టినా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. ఆ యా భూముల్లో అక్రమ నిర్మాణాలకు అడ్డు చెప్పాల్సిన ము న్సిపాలిటీ సిబ్బంది, గుడ్డిగా ఇంటి అనుమతులు కేటా యిస్తున్న వైనం వివాదాస్పదం అవుతోంది. ఇలా అధికా రులు, నేతల సహకారంతో రెచ్చిపోతున్న కబ్జా రాయు ళ్లు యథేశ్ఛగా ప్రభుత్వ స్థలాలను చేజిక్కించు కుంటూ అందినకాడికి దండుకుంటున్నారు.

అక్రమంగా వెంచర్‌ ఏర్పాటు...

మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని రాజరాజేశ్వర కా లనీలో కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు నాయకు ల సహకారాలతో ప్రభుత్వ భూముల్లో వెంచర్‌ ఏర్పా టు చేసి, యథేశ్ఛగా ప్లాట్లు విక్రయిస్తున్నారు. గర్మిళ్ల శి వారులోని తోళ్లవాగు పక్కన రాజరాజేశ్వర కాలనీలో సర్వే నెంబర్‌ 356లో మొత్తం 9.32 ఎకరాల బాంచరి (బంజేరు) భూమి ఉంది. అందులో గతంలో రెవెన్యూ అధికారులు రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తు న్న అనాథాశ్రమ నిర్మాణానికి, అబ్కారీశాఖ సర్కిల్‌ కా ర్యాలయ భవన నిర్మాణానికి, మిషన్‌ భగీరథ ట్యాంకు నిర్మాణానికి కొంత, కులాంతర వివాహాలు చేసుకున్న వారికి కొంత చొప్పున మొత్తం 6.12 ఎకరాల భూమిని కేటాయించారు. ఆయా వర్గాల వారికి ప్రొసీడింగులు సైతం అందజేశారు. అలా పంపకం చేసిన స్థలంలో ఆ యా నిర్మాణాలు జరుగగా, అవిపోను మరో 3.20 ఎక రాల మిగులు భూమి ఉండాలి. అత్యంత ప్రాధాన్య త గల స్థలం కావడంతో ఆ భూమి బహిరంగ మార్కెట్‌ విలువ ప్రస్తుతం ఎకరా రూ. 5 కోట్ల పైచిలుకు ధర ప లుకుతోంది. దశాబ్ధాలుగా సదరు భూమి ఖాళీగా ఉండ టంతో కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల కళ్లు దాని పై పడ్డాయి. అప్పటికే ఆ స్థలంలో ఐదారు అక్రమ షెడ్ల నిర్మాణం జరుగగా, వాటికి విద్యుత్‌ మీటర్లు కూడా మంజూరయ్యాయి. ప్రభుత్వ భూమిలో వెలిసిన షెడ్లకు విద్యుత్‌ కనెక్షన్లు ఎలా ఇచ్చారో....ఆ శాఖ అధికారులకే తెలియాలి. ఇదిలా ఉండగా ఆక్రమణలకు గురికాగా మి గిలిన దాదాపు మూడెకరాల భూమిలో ఏకంగా ప్లాట్ల వెంచర్‌ ఏర్పాటు చేయడం గమనార్హం. ప్రభుత్వ భూ మిలో వెంచర్‌ ఏర్పాటు చేసిన నాయకులు అందులో 30 ఫీట్ల వెడల్పుగల రోడ్డు కూడా నిర్మించారు. అందు లో ఏర్పాటు చేసిన ప్లాట్లను ఒక్కో చదరపు గజానికి రూ. 20 వేల వరకు విక్రయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

పట్టా భూమి నెంబర్‌తో రిజిస్ట్రేషన్లు....

ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన వెంచర్‌లోని ప్లా ట్లు ఒక చోట ఉంటే...మరో చోట ఉన్న పట్టా భూమి నెంబర్‌తో రిజిస్ట్రేషన్లు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందు కోసం ప్రభుత్వ స్థలం పక్కనే ఉన్న పట్టా భూ మి సర్వే నెంబర్‌ 354తో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి చే సినట్లు తెలుస్తోంది. డాక్యుమెంట్లన్నీ పట్టా భూమికి సంబంధించనవి కావడంతో బై నెంబర్ల ఆధారంగా రి జిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తికాగా, అవే డాక్యుమెంట్ల ఆధా రంగా మున్సిపాలిటీ నుంచి ఇంటి నిర్మాణాలకు అనుమ తులు కూడా తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్థలాల రిజిస్ట్రేషన్‌ సమయంలో, ఇంటి నిర్మాణ అను మతులు ఇచ్చే ముందు కూడా సంబంధిత అధికారులు స్థల పరిశీలన జరపకుండానే కేవలం డాక్యుమెంట్ల ఆధారంగా గుడ్డిగా ఆ ప్రక్రియను పూర్తి చేశారన్న అభి యోగాలు ఉన్నాయి.

మోసపోతున్న సామాన్యులు....

మంచిర్యాల జిల్లా కేంద్రంగా ఏర్పడ్డ తరువాత అం చలంచెలుగా అభివృద్ధి చెందుతోంది. మున్సిపల్‌ కార్పొ రేషన్‌గా అవతరించిన అనంతరం నగరం నలుమూల లా వేగంగా విస్తరిస్తోంది. దీంతో ఇక్కడి భూములకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. జిల్లా కేంధ్రంలో ఇం టి స్థలం కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో సామాన్యు లు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. దీ నిని ఆసరాగా చేసుకుంటున్న కొందరు అక్రమార్కులు ప్రభుత్వ భూములకు అక్రమ పట్టాలు సృష్టించి విక్ర యాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే సర్వే నెంబర్‌ 356 పేరిట అక్రమ పట్టాలు సృష్టించినట్లు తె లుస్తోంది. బై నంబర్ల పేరుతో అక్రమ దందాకు తెరలే పగా, లక్షలు వెచ్చించి ప్లాట్లు కొనుగోలు చేసిన సామా న్యులు నిండా మునిగే పరిస్థితులు నెలకొన్నాయి. ఆ యా ప్లాట్లను అధిక శాతం సింగరేణి ఉద్యోగులు, ప్ర భుత్వ ఉపాధ్యాయులు, ఫైనాన్స్‌ వ్యాపారులు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా ప్ర భుత్వ భూమి అన్యాక్రాంతంతోపాటు అందులో వెలు స్తున్న అక్రమ నిర్మాణాల విషయమై స్థానికులు పలు వురు మున్సిపల్‌ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్దపడుతున్నట్లు తెలిసింది.

Updated Date - Aug 29 , 2026 | 11:36 PM