Share News

భూసేకరణలో వేగం పెంచాలి

ABN , Publish Date - Sep 08 , 2026 | 11:21 PM

డిండి ఎత్తిపోతల భూసేకరణను వే గవంతం చేయాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అధికారులను ఆదేశించారు.

భూసేకరణలో వేగం పెంచాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

- సాగునీటి ప్రాజెక్టులపై సమీక్షలో కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌

నాగర్‌కర్నూల్‌, సెప్టెంబరు8 (ఆంధ్రజ్యో తి) : డిండి ఎత్తిపోతల భూసేకరణను వే గవంతం చేయాలని కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఐడీవోసీ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ స మావేశ మందిరంలో రెవెన్యూ అదనపు క లెక్టర్‌ చెన్నయ్యతో కలిసి జిల్లాలోని సాగు నీటి ప్రాజెక్టులకు సంబంధించిన భూసే కరణ, పెగ్‌ మార్కింగ్‌, పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ సంబంధిత అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వ హించారు. డిండి ఎత్తిపోతల పథకానికి అవస రమైన భూముల వివరాలపై అధికారులను అ డిగి తెలుసుకున్నారు. భూసేకరణకు సంబం ధించిన ప్రతీ అంశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిం చి పెండింగ్‌ సమస్యలనుగుర్తించి వాటి పరి ష్కారానికి చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సూచిం చారు. భూసేకరణలో ఏమైనా సమస్యలు, అ భ్యంతరాలు ఉంటే వాటిని వెంటనే గుర్తించి సంబంధిత అధికారులు సమన్వయంతో పరిష్క రించాలని సూచించారు. పెండింగ్‌ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించి నిర్ణీత సమయంలోగా ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చి వెంటనే పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సమా వేశంలో ఈఈలు, డీఈలు, ఏఈఈలు, రెవె న్యూ సాగునీటి శాఖలకు చెందిన సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 08 , 2026 | 11:21 PM