kumaram bheem asifabad- ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలి
ABN , Publish Date - Nov 21 , 2026 | 10:39 PM
ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్‌కుమార్, జాతీయ అధ్యక్షుడు కోట్నాక విజయ్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం వారు పర్యటించారు. ఈ సందర్భంగా గాంధీచౌక్‌లో గల కుమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు
సిర్పూర్(యు), నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్‌కుమార్, జాతీయ అధ్యక్షుడు కోట్నాక విజయ్‌కుమార్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం వారు పర్యటించారు. ఈ సందర్భంగా గాంధీచౌక్‌లో గల కుమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆదివాసీలు వారికి ఘనస్వాగతం పలకలడంతోపాటు వారికి శాలువాలతో సన్మానించారు. అనంతరం మైపతి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ డిమాండ్‌పై ప్రభుత్వానికి విన్నవించినా స్పందన లేకపోవడంతో డిసెంబరు 9న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్‌ను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఎస్సీ వర్గీకరణ సమస్యను పరిష్కరించిన ప్రభుత్వం, ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించే అంశంపై ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని చెప్పారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తున్నామని తెలిపారు. డిసెంబరు 9న నిర్వహించే బహిరంగ సభకు ఆదివాసీలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్ కుమార్, మండల అధ్యక్షుడు కుమ్ర భీమ్‌రావు,గౌరవ అధ్యక్షుడు పెందోర్ శంకర్, తుడుం దెబ్బ నాయకుడు ఆత్రం దౌలత్‌రావు, ఆదివాసీ నాయకులు ఆత్రం భగవంత్‌రావు, తోడసం ధర్మరావు,మెస్రం నాగోరావు, ఆత్రం ఆనంద్‌రావు, ఆత్రం శేషునారాయణ్, ఆత్రం నాగోరావు తదితరులు పాల్గొన్నారు.