Share News

సంత్‌ సేవాలాల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయండి

ABN , Publish Date - May 23 , 2026 | 05:16 AM

లంబాడీల ఆధ్యాత్మిక గురువు పేరుతో సంత్‌ సేవాలాల్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని లంబాడీ ప్రజాప్రతినిధులు కోరారు.

సంత్‌ సేవాలాల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయండి

  • సీఎంను కోరిన లంబాడీ ప్రజా ప్రతినిధులు

హైదరాబాద్‌, మే 22(ఆంధ్రజ్యోతి): లంబాడీల ఆధ్యాత్మిక గురువు పేరుతో సంత్‌ సేవాలాల్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని లంబాడీ ప్రజాప్రతినిధులు కోరారు. అలాగే ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ నుంచి ఎస్టీ కమిషన్‌ను వేరుచేసి.. ప్రత్యేక హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రిని శుక్రవారం ఆయన నివాసంలో కలిసిన వారిలో ఎంపీ బలరాంనాయక్‌, ప్రభుత్వ విప్‌ రామచంద్రనాయక్‌, ఎమ్మెల్యేలు మురళీనాయక్‌, రాందాస్‌ నాయక్‌, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌, ట్రైకార్‌ చైర్మన్‌ బెల్లయ్యనాయక్‌లు ఉన్నారు.

Updated Date - May 23 , 2026 | 05:16 AM