లక్ష్మీనృసింహుడి జయంత్యుత్సవాలకు శ్రీకారం
ABN , Publish Date - Apr 27 , 2026 | 05:26 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి ప్రధానాలయం, పాతగుట్ట ఆలయాల్లో జయంత్యుత్సవాలకు శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టారు. స్వామివారి దివ్యక్షేత్రంలో...
యాదగిరిగుట్ట, ఏప్రిల్ 26(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి ప్రధానాలయం, పాతగుట్ట ఆలయాల్లో జయంత్యుత్సవాలకు శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టారు. స్వామివారి దివ్యక్షేత్రంలో భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారంతో పాటు స్వామివారి జయంత్యుత్సవాలు ప్రారంభం కావడంతో హరిహరులను దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రానికి చేరుకున్నారు. 36వేల మంది భక్తులు క్షేత్రాన్ని సందర్శించగా వీఐపీ టికెట్ దర్శనానికి అరగంట, ధర్మదర్శనానికి గంటన్నర సమయం పట్టింది. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.38,48,195 ఆదాయం సమకూరినట్లు దేవస్థానం ఈవో జే.భవానీశంకర్ తెలిపారు.