రాష్ట్రంలో రోల్‌మోడల్ లక్షెట్టిపేట ఆసుపత్రి
ABN , Publish Date - Jun 22 , 2026 | 11:10 PM
రాష్ట్రంలో రోల్‌మోడల్ మన లక్షెట్టిపేట ప్రభుత్వ 30పడకల ఆసుపత్రి అని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్‌రావు అన్నారు. సోమవారం లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ ఆ సుత్రిని సందర్శించారు.
ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు
లక్షెట్టిపేట, జూన్ 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రోల్‌మోడల్ మన లక్షెట్టిపేట ప్రభుత్వ 30పడకల ఆసుపత్రి అని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్‌రావు అన్నారు. సోమవారం లక్షెట్టిపేట పట్టణంలోని ప్రభుత్వ ఆ సుత్రిని సందర్శించారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసి న విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజ లకు కార్పొరేటు తరహాలో వైద్యం అందించాలన్నదే లక్ష్యంగా ఈ ఆసు పత్రి నిర్మాణం చేపట్టామన్నారు. గతంలో ఇక్కడ ఉన్న ఆసుపత్రిలో సం వత్సరానికి సుమారు 25వేల మందికి కూడా వైద్య సేవలు అంద లేదని ఈఆసుపత్రి నిర్మించి కేవలం 10నెలల్లోనే 65మందికి పైగా వైద్య సేవ లు అందడం గొప్ప విషయం అన్నారు. వైద్య సేవలందించే సిబ్బం దిని మనస్పూర్తిగా అభినందించారు. ఆసుపత్రిని ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఏఒక్కరూ నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చ ర్యలు తప్పవన్నారు. అదే విధంగా పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనుల ను అడ్డుకుంటే సహించేది లేదని పట్టణంలో కొంతమంది వ్యా పారుల అవినీతి మొత్తం బయటకు తీస్తానని హెచ్చరించారు. రెండు రోజుల్లో రోడ్డు వెడల్పు పనులను మున్సిపల్ అధికారులు మొదలు పెట్టాలని అడ్డు ఉన్న ప్రతీది తొలగించాలని యజమానులకు ఇచ్చిన గడువు ముగిసిందన్నారు. ఇటిక్యాల నుంచిపాత బస్టాండ్ వరకు కూడా ఉన్న యజమానులు ఇచ్చిన కొలతల ప్రకారం తొలగించుకునేందుకు మరో అవకాశం ఇస్తున్నానన్నారు. రోడ్డు వెడెల్పులో నష్టపోతున్న పేదలను ఏదో ఒక రూపకంగా తప్పకుండా ఆదుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇ చ్చారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలినర్సయ్య, తహసీల్దార్ దిలీప్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ విజయ్‌కుమార్, ఆసుపత్రి సూపరిండెంట్ ఆకుల శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్మన్ మోత్కూరి రాజేశ్వరివెంకటస్వామి, వైద్యులు సురేష్, కృష్ణ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు షాహెద్‌ఆలీ, మండల అధ్యక్షుడు నలి మెల రాజు, ఎఎంసీ చైర్మన్ ప్రేమ్‌చంద్, వైస్ చైర్మన్ ఆరీఫ్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, ఆర్జీపీఆర్‌ఎస్ జిల్లా అద్యక్షు డు గడ్డం త్రిమూర్తి, నాయకులు పాల్గొన్నారు.