kumaram bheem asifabad- కొరవడిన పర్యవేక్షణ
ABN , Publish Date - Jul 03 , 2026 | 10:12 PM
రైతు సంక్షేమమే ధ్యేయమని చెబుతున్న పాలకులు పలు పథకాలను వారి దరికి చేర్చడంలో విఫలమవుతు న్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పల్లె ప్రజలు, రైతులకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. వ్యవసాయంతో పాటు అనుంబంధ రంగమైన పశువుల పెంపకం రైతుల జీవనోపాధిలో భాగమైంది. వ్యవసాయాఽధారిత గిరిజన జిల్లాలో చాలా మంది పశువుల పెంపకతో ఉపాధి పొందుతున్నారు.
- రైతులకు ప్రయోజనం చేకూరని వైనం
- పట్టించుకోని అధికారులు
కాగజ్‌నగర్, జూలై 3 (ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే ధ్యేయమని చెబుతున్న పాలకులు పలు పథకాలను వారి దరికి చేర్చడంలో విఫలమవుతు న్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పల్లె ప్రజలు, రైతులకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. వ్యవసాయంతో పాటు అనుంబంధ రంగమైన పశువుల పెంపకం రైతుల జీవనోపాధిలో భాగమైంది. వ్యవసాయాఽధారిత గిరిజన జిల్లాలో చాలా మంది పశువుల పెంపకతో ఉపాధి పొందుతున్నారు. జిల్లాలో పశు సంపద కూడా అధికంగానే ఉంది. పథకంలో అధికంగానే ఉండడం విశేషం. రైతులకు ఎంతగానో ఉపయోగపడే పశువుల కొట్టా లు ఉచితంగా నిర్మించుకోవటానికి అవకాశం కల్పించింది. కానీ అధికారులు అవగాహన కల్పించక పోవ డం ఈ పథకం పూర్తిగా విఫలమవుతుందన్న ఆరో పణలున్నాయి. 2025-26లో చేపట్టిన గణన ప్రకారం జిల్లాలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు మొత్తం 7,52,040 ఉన్నాయి. పశువుల సంఖ్యకు అనుగుణంగా కొట్టాలు నిర్మిస్తే రైతులు మేలు జరగనుంది.
- 15 మండలాల పరిధిలో..
జిల్లాలో 15 మండలాల్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ ఉపాఽధి హామీ పథకం కింద 208 పశువుల కొట్టాలు మంజూరయ్యాయి. ఇందులో 135 కొట్టాలు పనులు ఇంకా ప్రారంభించలేదు. 68 కొట్టా లు నిర్మాణ దశల్లోనే మగ్గుతున్నాయి. జిల్లాలోని కెరమెరి మండలంలో నాలుగు, వాంకిడిలో ఒకటి చొప్పున నిర్మాణం పనులు పూర్తయ్యాయి. అంటే జిల్లా వ్యాప్తంగా కేవలం ఐదు మాత్రమే పూర్త య్యాయి. పశువులు కలిగిన రైతులు ముందుగా కొట్టాల మంజూరు పంచాయతీకి పశువుల ఫొటోతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పశువైద్యాధికారి, ఎంపీడీవో, డీఆర్‌డీఏలు పరిశీలన, ధ్రువీకరణ అనంతరం మంజూరు చేస్తారు. పశువుల కొట్టం పొడువు 5.5 మీటర్లు, వెడల్పు 4.5 మీటర్లు, ఎత్తు 6.6. ఫీట్లు పై కప్పు రేకులు వేయాల్సి ఉంటుంది. కొట్టం పూర్తయిన వెంటనే ఏకమొత్తంలో లబ్ధిదారుడికి బిల్లు రూ.9వేలు జమ చేస్తారు. ఇందులో నుంచి క్యూసీ చార్జిల కింద బిల్లు నుంచి 10 శాతం కోత విధిస్తారు. రూ.80వేల నుంచి రూ.85వేల మేర బిల్లు చెల్లిస్తోంది. చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో ఏటా పేద పశుపోషకులు తాత్సాలిక షెడ్లు నిర్మించుకుని అవస్థలు పడుతున్నారు. ఇటీవల గాలివాన, ఈదురు గాలులకు పలు చోట్ల అవి కొట్టుకుపోయాయి. దీంతో రైతులు తీవ్ర అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇటువంటి సమయంలో పశువుల కొట్టా ల అవశ్యకత ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు చొరవ పశువులకు ఎంతో మేలు కలిగే ఈ పథకంపై పూర్తి స్థాయిలో అగాహన కార్యక్రమాలు కల్పించి వినియోగంలోకి తీసుకొచ్చేలా చూడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.