పట్టాలు లేక....పథకాలకు దూరం
ABN , Publish Date - Sep 09 , 2026 | 11:25 PM
సాగు చేసేందుకు భూ మి ఉంది. కానీ రెవెన్యూ రికార్డుల్లో పట్టాలేదు. దీంతో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది ఆ గ్రామస్థుల పరిస్థితి. ఆ గ్రామంలో భూ సర్వేలు జరుగుతున్నా ఏళ్లుగా ఉన్న భూ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు.
రీ సర్వేలోనైనా విముక్తి కలిగేనా....
ధరణిలో తప్పిదాలతో తప్పని అవస్థలు
నిషేధిత జాబితాలో రెతుల భూములు
భీమిని, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : సాగు చేసేందుకు భూ మి ఉంది. కానీ రెవెన్యూ రికార్డుల్లో పట్టాలేదు. దీంతో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది ఆ గ్రామస్థుల పరిస్థితి. ఆ గ్రామంలో భూ సర్వేలు జరుగుతున్నా ఏళ్లుగా ఉన్న భూ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. భూ రికార్డుల్లో తప్పులు, సరి హద్దు వివాదాలు, రెవెన్యూ అధికారుల అలసత్వంతో ఈ పరిస్థితి ఏర్పడుతున్నది. అప్పట్లో భూ ప్రక్షాలన, ధరణి రాకతో ఆ గ్రామం రైతులు భూ సమస్యల్లో కూరుకుపోయారు. పట్టాదారు పాసుపుస్తకాలు లేక బ్యాంకు రుణాలకు నోచుకోక, అప్పటి ప్రభు త్వంలో రైతుబంధు ప్రస్తుతం రైతుభరోసాలు రావడం లేదని ఆం దోళన చెందుతున్నారు. కొత్తగా ప్రవేశ పెట్టబోయే భూ భారతి రీ సర్వే లోనైనా తంగళ్లపల్లి గ్రామ రైతుల సమస్య పరిష్కారం లభి స్తుందని వారు ఆశిస్తున్నారు. ఏళ్లుగా సాగు చేస్తున్న పట్టా భూ ములకు పాస్‌పుస్తకాలు ఇవ్వక పోవడంతో ఆ రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. రైతుబంధు, రైతు భరో సా వంటి ప్రభుత్వ పథకాలు అందక తీవ్రంగా నష్టపోతున్నామ ని కన్నీటి పర్యంతమవుతున్నారు. భూ సమస్య పరిష్కరించాలని అధికారుల చుట్టూ...నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. భీమిని మండలంలోని తంగళ్లపల్లి గ్రామంలో ఇందూరు వంశంలో మూ డు తరాలు కావస్తున్నా ఇప్పటికీ వీరి భూ సమస్య పరిష్కారం కా వడం లేదు. సర్వే నంబరు 1 నుంచి 59 వరకు 300 ఎకరాల పెద్ద పట్టా, 300 ఎకరాల లావణి పట్టా భూమి ఉంది. గత తెలంగాణ ప్రభుత్వం కొత్త పాసు పుస్తకాలు జారీ చేయక ముందు వీరికి పట్టాలు ఉండేవి. అయితే భూములకు సంబంధించిన రికార్డులు సక్రమంగా లేక పోవడంతో రెవెన్యూ అధికారులు ఆ 600 ఎకరాల భూములను డిస్స్పూట్‌లో పెట్టారు.
మండలం మార్పుతో...
రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం పునర్విభజనలో భాగంగా 2016లో తంగళ్లపల్లి గ్రామం కుమురంభీం జిల్లా దహగాం మం డలం నుంచి భీమిని మండలంలో కలిపారు. కానీ తంగళ్లపల్లి గ్రా మ రెవెన్యూ రికార్డులు భీమిని తహసీల్దార్ కార్యాలయానికి ఇవ్వ లేదు. 1983లో దహగాం మండల తహసీల్దార్ కార్యాలయానికి మావోయిస్టులు నిప్పు పెట్టడంతో రెవెన్యూ రికార్డులు దగ్ధం అ య్యాయి. దీంతో దహగాం మండలం నుంచి భీమిని మండలా నికి గ్రామ రెవెన్యూ రికార్డులు అందక పోవడంతో భూ సమస్యకు ప్రధాన కారణంగా మారింది.
రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో...
గతంలో రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదాలతో తాము నష్ట పోతున్నామని గ్రామ రైతులు ఆరోపించారు. ఒకరికి సంబంధిం చిన భూమిని మరొకరి పేరు మీదకి రికార్డుల్లో మార్చారని ఆరోపించారు.
- అధికారులు సర్వేలు చేసినా...
రెవెన్యూ అధికారులు 2022లో ఉన్నతాధికారుల అదేశాల మే రకు గ్రామంలో గ్రామంలో రీ సర్వే చేశారు. సర్వే చేసి మూడు ఏళ్లు గడుస్తున్నా ఇంత వరకు భూహక్కు పత్రాలు రాలేదని రైతు లు ఆవేదన చెందుతున్నారు. గ్రామంలో రైతులకు పట్టా పాసు పుస్తకాలు లేకపోవడంతో బ్యాంకు అధికారులు పంటరుణాలను ఇ వ్వడం లేదు. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు రుణాలు తీసుకొని అప్పుల్లో కూరుకుపోతున్నారు.
- ఎరువులకు తీవ్ర ఇబ్బందులు...
భూముల్లో కాస్తులో ఉండి పట్టాలు లేక పోవడంతో ఎరువులు, పెట్టుబడి సహాయం, పీఎం కిసాన్ పథకం, రైతు భరోసా పథ కాలు అందడం లేదు. ముఖ్యంగా పంటలను పండించడానికి ఎ రువులు లభించడం లేదు.
పంటలు అమ్మేందుకూ ఇబ్బందులే...
ఆన్‌లైన్‌లో భూములు వివరాలు నమోదు లేక పోవడంతో ఆ గ్రామ రైతులు తాము పండించిన ధాన్యాలను మార్కెట్లో అమ్మడా నికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రైతులు దళారులను ఆశ్రయించి తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. అంతే కాకుండా అప్పట్లో ఇక్కడి రైతులు దహ గాం బ్యాంకుల్లో తీసుకున్న రుణాలకు రెన్యూవల్ చేసుకోలేక ప ట్టాదారు పాస్ పుస్తకం ఆన్‌లైన్‌లో లేకపోవడంతో 9 ఏళ్లుగా బ్యాం కు వడ్డీలు పెరిగి బ్యాంకు వారు నోటీసులు ఇచ్చి భూములు జప్తు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు.
ప్రభుత్వ పథకాలకు దూరం.....
రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్ల గ్రామంలో రైతులు ప్రభుత్వ పథకాలు రైతు బంధు, రైతు బీమా, క్రాప్‌లోన్ వంటి బెనిఫిట్స్ పొందలేక పోతున్నారు. ఏళ్ల తరబడి రెవెన్యూ కార్యాలయాల చు ట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం లేకుండా పోయిందని గ్రా మ రైతులు ఆవేదన చెందుతున్నారు. గ్రామ రైతులు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణిలో మంత్రులకు, ఎమ్మె ల్యేలకు ఎన్ని సార్లు అప్లికేషన్లు ఇచ్చినా మొరపెట్టుకున్నా సమస్య పరిష్కా రానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పెండింగ్‌లో ఎన్న ధరణి సమస్యలు పరిష్కారం చేస్తామన్న ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై తంగళ్లపల్లి రైతులు ఆశలు పెట్టుకున్నారు.
- త్వరగా రైతులకు న్యాయం చేయాలి...
32 భీమిని 08 ఇందూరి భూమేష్, మాజీ సర్పంచు, చిన్నతిమ్మాపూర్.
తాతల కాలం నుంచి సాగులో ఉన్నాము అధికారుల చుట్టూ తి రిగినా పట్టాలు రావడం లేదు. మూడు తరాలు మారినా పట్టాలు రావడం లేదు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోని రైతులకు పట్టాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలి.
మా భూమి పట్టా మాకు ఇవ్వరా...
33 భీమిని 08 ఇందూరి బాలేష్, తంగళ్లపల్లి, రైతు
మా భూమి పట్టాలు మాకు ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటో తెలియడం లేదు. నాకు 15 ఎకరాల భూమి ఉన్నది ప్రస్తుతం సా గులో ఉన్నాను కానీ పట్టాలు లేవు. ధరణితో నష్ట పోయాము ఇ ప్పుడు భూభారతి అంటున్నారు. ఇందులోనైనా మా భూముల ప ట్టాలు మాకు వస్తాయో తెలియడం లేదు. భూములకు పట్టాలు లేకపోవడంతో ప్రభుత్వం అందించే సంక్షమ పథకాలు అందడం లేదు. అధికారులు, నాయకులు స్పందించి కొత్త పాసు పుస్తకాలు అందించాలి.
సమస్య పరిష్కారం ఎప్పుడో...
34 భీమిని 08 ఇందూరి శ్రీనివాస్, రైతు, తంగళ్లపల్లి
తొమ్మిది ఏళ్లుగా కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగా ము. మా భూసమస్యలు మాత్రం పరిష్కారం అవ్వడం లేదు. బ్యాంకు రుణాలు, రైతు భరోసా, రుణమాఫీలు, రుణాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. గ్రామంలో మా భూమిలో సాగు చే స్తున్నాం కానీ మాకు పట్టాలు లేవు. రెవెన్యూ అధికారులు రీ సర్వే చేసినప్పటికీ నేటికీ పట్టాలు రాలేదు.