kumaram bheem asifabad- వసతుల కొరత.. రోగుల అవస్థ
ABN , Publish Date - Mar 24 , 2026 | 10:43 PM
బెజ్జూరు మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో వసతుల లేమితో ఆసుపత్రికి వచ్చే రోగులు అవస్థలు పడుతున్నారు. మండల కేంద్రంలోని ఆసుపత్రికి వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రతిరోజు సుమారు వంద మందికిపైగా వస్తుంటారు. ఈ క్రమంలో ఇక్కడ సరైన వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నా రు. మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
బెజ్జూరు, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): బెజ్జూరు మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో వసతుల లేమితో ఆసుపత్రికి వచ్చే రోగులు అవస్థలు పడుతున్నారు. మండల కేంద్రంలోని ఆసుపత్రికి వివిధ వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రతిరోజు సుమారు వంద మందికిపైగా వస్తుంటారు. ఈ క్రమంలో ఇక్కడ సరైన వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నా రు. మరుగుదొడ్లు, మూత్రశాలలు లేక ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఎటు వెళ్లాలో తెలియక అవస్థలు పడుతున్నారు. ఆసుపత్రికి వచ్చే ఇన్‌పేషెం ట్స్, ప్రసవం కోసం వచ్చే మహిళలు, వారి వెంట వచ్చే కుటుంబ సభ్యులకు ఇబ్బందులు తప్పడం లేదు.
- స్థాయి పెంచినా..
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేస్తూ సామాజిక ఆరోగ్య కేంద్రంగా మార్చింది. కానీ స్థాయి పెంచి ఏళ్లు గడుస్తున్నా ఆసుపత్రికి పక్కా భవనం లేదు. రోగులకు మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మించలేదు. గతంలో ఉన్న మరుగుతొడ్లు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. దీంతో ఇక్కడికి వచ్చే రోగులు అనేక అవస్థలు పడుతున్నారు. 30పడకల ఆసుపత్రిగా మార్చినా అందే సేవలు మాత్రం నామమత్రామే. ఉన్నతాధికారులు తనిఖీకి వచ్చినప్పుడల్లా సౌకర్యాలేమిపై ఫిర్యాదు చేస్తున్నా ఏ ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదని రోగులు వాపోతున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రోగులు తమ కష్టాలను దిగమింగుకుంటున్నారు. స్థాయి పెంచినా సౌకర్యాలు కల్పించడం లేదంటూ రోగులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆసపత్రిలో మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్మించాలని కోరుతున్నారు.
వసతుల కల్పనకు కృషి..
- అవినాష్, డీసీహెచ్‌ఎస్, ఆసిఫాబాద్
మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో వసతుల కల్పనకు కృషి చేస్తా. ఇప్పటికే పక్కా భవన నిర్మా,ణం కోసం ప్రభుత్వానికి నివేధికను అందజేశాం. గతంలో ఉన్న మరుగుదొడ్లకు మరమ్మత్తులు చేయి స్తాం. రోగులు అవస్థలు పడకుండా చర్యలు తీసుకుం టాం.