Share News

సహకారం కరువు

ABN , Publish Date - Oct 06 , 2026 | 11:59 PM

వ్యవసాయ సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం కార్యరూపం దాల్చడం లేదు. ప్రో త్సాహం లేక దశాబ్ధాల చరిత్ర కలిగిన సొసైటీలు డీలా పడిపోతున్నాయి.

సహకారం కరువు

-డీలా పడిపోతున్న పీఏసీఎస్‌లు

-సిబ్బంది జీతాలు చెల్లించలేని స్థితిలో సంఘాలు

-అద్దెభవనాల్లో కార్యాలయాలు

- రవాణా చార్జీల నిలిపివేతతో అదనపు భారం

నెన్నెల, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి) : వ్యవసాయ సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం కార్యరూపం దాల్చడం లేదు. ప్రో త్సాహం లేక దశాబ్ధాల చరిత్ర కలిగిన సొసైటీలు డీలా పడిపోతున్నాయి. జిల్లాలో 20 సహకార సంఘాలు ఉం డగా నాలుగింటికి సొంతభవనాలు లేవు. కనీససౌకర్యా లు లేని అద్దె ఇళ్లల్లో కార్యాలయాలు కొనసాగుతున్నా యి. ఒక్కోచోట ఆపీసుల కిరాయి చెల్లించలేని పరిస్థితి ఉంది. అన్ని సంఘాల్లో సిబ్బంది కొరత వేఽధిస్తోంది. ఉన్న వారికి నెలల తరబడి జీతాలు రావడం లేదు. సంఘాలకు కంప్యూటర్లను అందించినప్పటికి ఆపరేట ర్లులేక ఆన్‌లైన్‌ సేవలు వెనుకబడుతున్నాయి. మూడు, నాలుగు సంఘాలకు ఒకే ఆపరేటర్‌ పనులు చేస్తున్నా డు. అనుబంధ బ్యాంకులు స్థానికంగా లేక పోవడం స భ్యులకు ఇబ్బందిగా మారింది. బ్యాంకింగ్‌ సేవల కోసం సమీప పట్టణాలకు వెళ్లాల్సి వస్తోంది. సొసైటీల్లో కనీస సౌకర్యాలు లేక రైతులు, సభ్యులు, సిబ్బంది ఇక్కట్ల పాలవుతున్నారు. విత్తనాలు, ఎరువుల అమ్మకంతో కొం త రాబడి ఉండేది. కాని ఎరువుల రవాణా చార్జీలను ప్రభుత్వం చెల్లించడం నిలిపి వేయడంతో పీఏసీఎస్‌ లపై అదనపు భారం పడుతోంది. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో సంఘాలకు చేయూతనిస్తేనే భవిష్యత్తులో ఆర్థిక పురోగతి సాదించే అవకాశం ఉంది.

-గతమెంతో ఘణకీర్తి...

సహకార చట్టం (1964) ద్వారా రైతులను ఆదు కునేందుకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఏర్పాటయ్యాయి. గతమెంతో ఘణకీర్తి కలిగిన సొసైటీలు ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటు న్నాయి. జిల్లాలో 20 సహకార సంఘాలుండగా, వాటి లో దాదాపు 50 వేల మంది సభ్యులున్నారు. అన్ని సం ఘాలకు పాలకవర్గాలున్నాయి. వారి పదవీకాలం పూర్త యినప్పటికి హైకోర్టు ఆదేశాలతో తిరిగి బాధ్యతలు స్వీ కరించారు. వారు విధులు, నిధులు లేక సమీక్ష సమా వేశాలకే పరిమితమవుతున్నారు. కొన్ని చోట్ల డైరెక్టర్లు జాతీయ పండుగలకు జెండా వందనానికి వచ్చి వెళ్లడం తప్ప మిగతా సమయాల్లో ఆఫీసుల్లో కానరావడం లే దు. గతంలో సంఘాల ద్వారా ఏటా కోట్ల రూపాయల టర్నోవర్‌తో వివిధ కార్యక్రమాలు చేపట్టేవారు. ఎరువు లు, విత్తనాలు అమ్మడంతో పాటు పంట ఉత్పత్తుల కొ నుగోళ్ల్లు చేపట్టి వచ్చే అంతంత మాత్రపు కమీషన్‌తోనే సంఘాలు నడుస్తున్నాయి. సిబ్బంది నెలల తరబడి జీతాలు తీసుకోకుండా సొసైటీలను నెట్టుకొస్తున్నారు.

నాలుగు సంఘాలకు సొంత భవనాలు లేవు...

జిల్లాలోని నెన్నెల, చంద్రవెల్లి, భీమిని, చెన్నూరు పీ ఏసీఎస్‌లకు సొంతభవనాలు లేవు. అద్దె ఇళ్లలో కొన సాగుతున్నాయి. మౌలిక వసతులు లేక పోవడంతో స భ్యులతో పాటు సిబ్బంది ఇక్కట్లపాలవుతున్నారు. సర్వ సభ్య సమావేశాల నిర్వహన ఇబ్బందిగా మారింది. కా ర్యాలయాల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక పో వడంతో వచ్చేవారికి అవస్థలు తప్పడం లేదు. కనీసం తాగేందుకు మంచినీటి వసతి కూడా లేక అల్లాడుతు న్నారు. భవనాలు లేక సంఘం సభ్యులకు, రైతులకు పూర్తిస్థాయి సేవలు అందడం లేదు. సొంత గిడ్డంగు లు లేకపోవడంతో అమ్మకానికి తెచ్చిన ఎరువుల బస్తా లు, విత్తనాలను కిరాయి ఇళ్లల్లో నిల్వ ఉంచుతున్నారు. సొంత భవనాలు, గోదాములు నిర్మించాలని పలుమా ర్లు తీర్మాణాలు చేసినప్పటికి ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు.

-జీతాలు చెల్లించలేని పరిస్థితి...

ఆన్‌లైన్‌ సేవల కోసం సంఘాలకు కంప్యూటర్‌, ప్రింటర్‌, స్కానర్‌, టేబుల్‌ను సమకూర్చారు. ఒక ఆప రేటర్‌ను నియమించుకొని సంఘం సభ్యులు, వారి రు ణ వివరాలు, ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు, ధాన్యం కొనుగోళ్ల, అమ్మకాలు, డబ్బుల చెల్లింపులు ఎప్ప టికప్పుడు ఆన్‌లైన్‌ చేయాల్సి ఉంది. ఆర్థిక ఇబ్బందులతో చాలా చోట్ల ఆపరేటర్లను నియమించు కోలేదు. పార్ట్‌టైం వర్కర్లతో పనులు చేయించుకుం టు న్నారు. రెగ్యులర్‌ సిబ్బందికే ఏడాది కాలంగా జీతాలు రావడం లేదు.. ఆపరేటర్లను పెట్టుకొని వారికి వేతనా లు ఎక్కడి నుంచి ఇవ్వాలని అధికారులు నిట్టూరుస్తున్నారు.

-అదనపు భారం

వానాకాలం, యాసంగి సీజన్‌లలో రైతులకు పీఏసీ ఎస్‌ల ద్వారా ఎరువులు సరఫరా చేస్తున్నారు. సహకార సంఘాలకు బహిరంగ మార్కెట్‌ ధర కంటే తక్కువకు మార్క్‌ఫెడ్‌ ఎరువులు సరఫరా చేస్తుంది. రవాణా చా ర్జీలను సైతం మార్క్‌ఫెడే చెల్లించేది. మూడు నెలలు గా చెల్లింపులను నిలిపివేయడంతో పీఏసీఎస్‌లపై అద నపు భారం పడుతోంది. జిల్లాలోని సొసైటీలు, డీసీఎం ఎస్‌లకు మంచిర్యాల, పెద్దపల్లి రైల్వే స్టేషన్ల నుంచి ఎ రువులు సరఫరా చేస్తారు. మంచిర్యాల నుంచి ఎరు వులు వచ్చినప్పుడు పీఏసీఎస్‌కు ఉన్న దూరాన్ని బట్టి రూ. 8 వేల వరకు, పెద్దపల్లి నుంచి వస్తే రూ. 12 వేల వరకు ట్రాన్స్‌పోర్ట్‌ ఆపరేటర్లకు చెల్లించాల్సి వస్తోంది. రవాణా చార్జీల చెల్లింపులతో జిల్లాలోని పీఏసీఎస్‌లపై లక్షల రూపాయల భారం పడుతోంది.

Updated Date - Oct 06 , 2026 | 11:59 PM