Share News

kumaram bheem asifabad- మౌలిక వసతులు కరువు

ABN , Publish Date - Nov 01 , 2026 | 10:56 PM

నిజాం నవా బు కాలం నాటి చారిత్రాత్మక వైభవానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఆసిఫాబాద్‌ రోడ్‌ రైల్వే స్టేషన్‌ త్వరలోనే శతాబ్ధి ఉత్సవాలకు చేరువ అవుతోంది. సుమారు 98 ఏళ్ల సుదీర్ఘ చిత్ర కలిగిన ఈ స్టేషన్‌ నేటికి కుమరం భీం ఆసిపాబాద్‌ జిల్లాతో పాటు రెబ్బెన పరిసర ప్రాంతా ప్రజలకు అత్యంత కీలకమైన రవాణా కేంద్రంగా సేవలు అందిస్తోంది. కాలక్రమేనా ట్రాక్‌ విద్యుదీకరణ, ఆధునిక సిగ్నలింగ్‌ వ్యవస్థలు అందుబాటులోకి వచ్చినప్పటికీ నిత్యం రాక పోకలు సాగించేందుకు వేలాది మంది ప్రయాణికుల కనీస అవసరాలకు తగ్గట్టుగా మౌలిక వసతులు కల్పించడ ంలో రైల్వే యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తోం దన్న విమర్శలున్నాయి.

kumaram bheem asifabad- మౌలిక వసతులు కరువు
ఆసిఫాబాద్‌ రోడ్‌ రైల్వేస్టేషన్‌ ట్రాక్‌

- ప్లాట్‌ఫారం- 2పై మరుగుదొడ్లు లేక ఇబ్బందులు

- నిజాం కాలం నాటి స్టేషన్‌ అభివృద్ధికి చర్యలు శూన్యం

రెబ్బెన, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): నిజాం నవా బు కాలం నాటి చారిత్రాత్మక వైభవానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచిన ఆసిఫాబాద్‌ రోడ్‌ రైల్వే స్టేషన్‌ త్వరలోనే శతాబ్ధి ఉత్సవాలకు చేరువ అవుతోంది. సుమారు 98 ఏళ్ల సుదీర్ఘ చిత్ర కలిగిన ఈ స్టేషన్‌ నేటికి కుమరం భీం ఆసిపాబాద్‌ జిల్లాతో పాటు రెబ్బెన పరిసర ప్రాంతా ప్రజలకు అత్యంత కీలకమైన రవాణా కేంద్రంగా సేవలు అందిస్తోంది. కాలక్రమేనా ట్రాక్‌ విద్యుదీకరణ, ఆధునిక సిగ్నలింగ్‌ వ్యవస్థలు అందుబాటులోకి వచ్చినప్పటికీ నిత్యం రాక పోకలు సాగించేందుకు వేలాది మంది ప్రయాణికుల కనీస అవసరాలకు తగ్గట్టుగా మౌలిక వసతులు కల్పించడ ంలో రైల్వే యంత్రాంగం ఉదాసీనంగా వ్యవహరిస్తోం దన్న విమర్శలున్నాయి. 1928లో ఆసిపాబాద్‌ రోడ్‌ రైల్వే స్టేషన్‌కు రైల్వే చరిత్రలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 1928 నంవత్సరం 15న కాజీపేటా-బల్లార్షా మధ్య ప్రధాన రైల్వేలైన్‌ ప్రారంభమైన సమయంలోనే ఆసిఫాబాద్‌ రోడ్‌ విభాగంలో కూడా ప్రజలకు అందు బాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ఉత్తర, దక్షిణ భారత దేవాలను కలిపే కీలక మార్గంలో ఈ స్టేషన్‌ మైలు రాయిగా నిలిచింది. సుమారు శతాబ్ద కాలంగా ఈ ప్రాంత ప్రయాణికులు, సింగరేణి బొగ్గు గని కార్మికులకు నమ్మకమైన ప్రయాణ వేదికగా సేవలను అందిస్తోంది.

- స్టేషన్‌ పరిధిలో..

ఈ స్టేషన్‌లో రెండు ప్లాట్‌ఫారాలు ఉండగా, ప్లాట్‌ఫారం- 1పై మాత్రమే మరుగుదొడ్ల సదుపాయం ఉంది. అత్యధికంగా రైళ్ల రాక పోకలు ప్లాట్‌ఫారం-2పై కనీస మూత్ర శాలలు, మరుగుదొడ్లు లేక పోవడంతో రైళ్ల కోసం వేచి ఉండే మహిళలు, చిన్నారులు, వయోవృద్ధులు ప్లాట్‌ఫాం మారి వెళ్లడం వృద్ధులకు కష్టతరంగా మారుతోంది. తక్షణమే రెండో నంబరు ప్లాట్‌ఫారంపై అత్యాధునిక శౌచాలయాలు నిర్మించా లని ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్లాట్‌ఫా రం-2పై ప్రస్తుతం ఉన్న షెడ్డు ప్రయాణీకుల రద్దీకి ఏ మాత్రం సరి పోవడం లేదు. షెడ్ల మధ్య భారీగా ఖాళీ ప్రదేశాలు ఉండడంతో ఎండకు ఎండుతూ, వర్షానికి తడుస్తూ ప్రయాణికులు వేచి చూడాల్సి వస్తోంది. ఖాళీ స్థలాల్లో మరో రెండు లేదా మూడు షెడ్లు నిర్మించాలని కోరుతున్నారు. వీటికి తోడు జిల్లా కేంద్రం ఆసిఫాబాద్‌తో పాటు రెబ్బెన, వాంకిడి, కెరమెరి, భీమిని మండలాల ప్రజలు, విద్య, ఉద్యోగం, వ్యాపార, మెరుగైన వైద్య అవసరాల నిమిత్తం హైదరాబాద్‌ స హా ఇతర నగరాలకు వెళ్లేందుకు ముఖ్యమైన సూపర్‌ ఫాస్ట్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ఇక్కడ స్టాపేజీ కల్పించాలని ప్రయాణికులు రైల్వే బోర్డుకు విజ్ఙప్తి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్‌ను ఆధునీ కరణ పనులు ప్రారంభించగా, ఈ రైల్వే స్టేషన్‌లో కూడా పలు అభివృద్ధి పనులు చేపడుతున్నారు.

Updated Date - Nov 01 , 2026 | 10:56 PM