kumaram bheem asifabad-లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి
ABN , Publish Date - Oct 24 , 2026 | 10:57 PM
హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ఆది, సోమవారాల్లో కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మల్టిపుల్ డేస్ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యూనియన్ జిల్లా కార్యదర్శి రాజేందర్ కోరారు.
వాంకిడి, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ఆది, సోమవారాల్లో కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మల్టిపుల్ డేస్ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యూనియన్ జిల్లా కార్యదర్శి రాజేందర్ కోరారు. మండలంలోని టోల్‌ప్లాజా వద్ద ధర్నాకు సంబందించిన పోస్టర్లను శనివారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేసి కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించి ఉద్యోగులకు పీఆర్‌సీ అమలు చేసి డి ఏ వర్తింజేయాలని ఆయన కోరారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధనకు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో కార్మికులు పవన్, దినేష్, వేణుగోపాల్, చరణ్, రాజు, సునీల్, రత్నాకర్, ప్రసాద్, ధన్‌రాజ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి
సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్
ఆసిఫాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): రెండు సంవత్సరాల లెప్రసీ సర్వేల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్ డిమాండ్ చేశారు. స్థానికంగా శనివారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రారంభమయ్యే లెప్రసీ సర్వేకు ప్రభుత్వం గతంలో చెల్లించిన విధంగానే ఆశా వర్కర్లకు అదనపు పారితోషకం చెల్లించాలని చెప్పారు. గతంలో నిర్వహించిన లెప్రసీ సర్వేలకు సంబందించిన పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత రెండు సంవత్సరాల లెప్రసీ సర్వే డబ్బులు చెల్లిస్తేనే ఈ ఏడాది సర్వే నిర్వహిస్తామని ఆశా వర్కర్లు తెలిపారు. అనంతరం డీఎంహెచ్‌వో నాగేంద్ర సిడాంకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్ష, ప్రదాన కార్యదర్శులు స్వరూప, పద్మ, ఆశా కార్యకర్తలు కవిత, అర్చన, లక్ష్మి, సునీత, దయవతి తదితరలు పాల్గొన్నారు.