Share News

kumaram bheem asifabad- కూలీలు సద్వినియోగం చేసుకోవాలి

ABN , Publish Date - Oct 13 , 2026 | 11:12 PM

వీబీజీ రామ్‌జీ పనులను కూలీసులు సద్విని యోగం చేసుకోవాలని ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని మర్తిడి గ్రామంలో చేపడుతున్న పనులను మంగళవారం ఎంపీడీవో పరిశీలించారు.

kumaram bheem asifabad- కూలీలు సద్వినియోగం చేసుకోవాలి
మర్తిడిలో పనులు పరిశీలిస్తున్న ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌

బెజ్జూరు, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): వీబీజీ రామ్‌జీ పనులను కూలీసులు సద్విని యోగం చేసుకోవాలని ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. మండలంలోని మర్తిడి గ్రామంలో చేపడుతున్న పనులను మంగళవారం ఎంపీడీవో పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సమీపంలో చేపడుతున్న కందకాల పనులు పరిశీలించి కూలీలతో మాట్లాడారు. ఎల్‌నినో దృష్ట్యా నీటి సంరక్షణ పనులు, ఇంకుడు గుంతలు, రైతుకు పంటకుంటలు, ఊరికి ఊట కుంటలు, బోర్వెల్‌ రీచార్జ్‌ స్ట్రక్చర్లు చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మల్లేష్‌, ఎఫ్‌ఏ దాసు పాల్గొన్నారు.

కెరమెరి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రతి గ్రామ పంచాయతీల నుంచి కూలీల శాతం పెంచాలని జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం ఆయన కొఠారి గ్రామంలో విబీజీరాంజీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో వంద శాతం కూలీలు పనులకు హాజరయ్యేలా చూడాలన్నారు. రైతుల పంట చేన్లలో పంట పొలాల అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. పశువుల పాకలు, పౌలీ్ట్ర ఫాం తదితర పనులు చేపట్టాలన్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ మల్లయ్య, ఉపాధి హామీ సిబ్బంది, సతీష్‌, తరుణ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 13 , 2026 | 11:12 PM