Share News

లేబర్‌ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలి

ABN , Publish Date - May 10 , 2026 | 11:29 PM

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌ లను వెంటనే రద్దు చేయాలని సీఐ టీయూ జిల్లా సహాయ కార్యదర్శి పొదిల రామయ్య డిమాండ్‌ చేశా రు.

లేబర్‌ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలి
నాలుగు లేబర్‌ కోడ్‌ల ప్రతులను దహనం చేస్తున్న ఏఐటీయూసీ నాయకులు

- సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి రామయ్య

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, మే 10 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌ లను వెంటనే రద్దు చేయాలని సీఐ టీయూ జిల్లా సహాయ కార్యదర్శి పొదిల రామయ్య డిమాండ్‌ చేశా రు. ఆదివారం సీఐటీయూ ఆధ్వ ర్యంలో జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌర స్తాలో లేబర్‌కోడ్‌ల చట్టం ప్రతు లను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. రా మయ్య మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం తీసు కువచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌ చట్టాలు కార్మి కుల హక్కులను కాలరాసే విధంగా ఉన్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పం దించి పోరాడి సాధించుకున్న కార్మికచట్టాలను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు లక్ష్మ య్య, ఆంజనేయులు, నిరంజన్‌, మురళి, ముర్తు జా, శివ పాల్గొన్నారు.

నాలుగు లేబర్‌ కోడ్‌ల ప్రతుల దహన

కల్వకుర్తి, (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్‌ కోడ్ల ప్రతులను క ల్వకుర్తి అంబేడ్కర్‌ చౌరస్తాలో సీఐటీయూ నా యకులు దహనం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి.ఆంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.శ్రీనివాసులు, ఉపా ధ్యక్షులు శంకరనాయక్‌, వి.పర్వతాలు, సవుట పార్వతమ్మ, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు దేశనాయక్‌, కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పులిజాల పరశురాములు, అధ్యక్షులు అంతటి కాశన్న, ఎన్‌పీఆర్‌డీ సంఘం నాయకులు నాగ రాజు, సత్యనారాయణ, ప్రజానాట్య మండలి భీమ్‌రాజు, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 10 , 2026 | 11:29 PM