లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలి
ABN , Publish Date - Apr 01 , 2026 | 11:24 PM
కేంద్ర ప్రభుత్వం తీసు కువచ్చిన నాలుగు లేబర్‌కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం ఐఎఫ్‌టీ యూ, ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో మంచిర్యాలలోని బస్టాండ్ సెంటర్‌లో కేం ద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
మంచిర్యాల కలెక్టరేట్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వం తీసు కువచ్చిన నాలుగు లేబర్‌కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని ఐఎఫ్‌టీయూ జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం ఐఎఫ్‌టీ యూ, ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో మంచిర్యాలలోని బస్టాండ్ సెంటర్‌లో కేం ద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కార్పోరేట్‌లకు అనుకూలంగా కోడ్‌లను తీసుకురావడం దేశ కార్మి క వర్గాన్ని కట్టు బానిసలుగా చేసేందుకేనని పేర్కొన్నారు. పంచాయతీ, భవ న నిర్మాణం, ఆశాలు, మున్సిపాలిటీ వర్కర్లు, అంగన్‌వాడీ తదితర సంఘ టిత అసంఘటిత రంగాల్లో పనిచేస్తూ పోరాడి సాధించుకున్న 44 చట్టాల ను నాలుగు కోడ్‌లుగా మార్చడం సరైంది కాదన్నారు. వెంటనే ఈ కోడ్‌ల ను రద్దు చేయాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు లాల్ కుమార్, మల్లన్న, దేవి సత్యం, అరుణ, సురేందర్, సారయ్య, సమ్మన్న, సత్య నారాయణ పాల్గొన్నారు.
-సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన
కేంద్రం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని కోరు తూ బుధవారం జిల్లా కేంద్రంలో సీఐటీయూ నాయకులు నల్లబ్యాడ్జీలు ధ రించి ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి రంజిత్‌కుమార్ మాట్లాడుతూ కేంద్రం తీసుకువచ్చిన నాలుగు లేబర్‌కోడ్‌లు కార్మికుల జీవితాలను నాశనం చేసే విధంగా ఉన్నాయన్నారు. వెంటనే ఈ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యుత్ సవరణ బి ల్లును వెనక్కి తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకన్న, స రిత, అనసూయ, పద్మ, తదితరులు పాల్గొన్నారు.