Share News

లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి

ABN , Publish Date - Feb 12 , 2026 | 11:31 PM

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతి రేక నాలుగు లేబర్‌ కోడ్‌లను వెంటనే రద్దు చే యాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌ అ న్నారు.

లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలి
అచ్చంపేటలో ర్యాలీ నిరహించిన వామపక్షాల నాయకులు, కార్మికులు

- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రమేశ్‌

అచ్చంపేటటౌన్‌/ కల్వకుర్తి/ కొల్లాపూర్‌/ చారకొండ/ తిమ్మాజిపేట, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతి రేక నాలుగు లేబర్‌ కోడ్‌లను వెంటనే రద్దు చే యాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌ అ న్నారు. కార్మికులకు మరణ శాసనంగా తెచ్చిన నాలుగు లేబర్‌కోడ్‌ల రద్దుకై కేంద్ర కార్మిక సం ఘాలు ఇచ్చిన పిలుపు మేరకు గురువారం జి ల్లాలో సార్వత్రికసమ్మె విజయవంతమైంది. సీఐ టీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, ఏఐఎస్‌ ఎఫ్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 29కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో 2019-20లో కరోనా సమ యం లో నాలుగు లేబర్‌ కోడ్‌ల నుతీసుకువచ్చిందని, ఈ కోడ్స్‌ కార్మికుల హక్కులను హరించి కార్పొ రేట్‌ సంస్థలకు అనుకూలంగా మార్గం సుగమం చేస్తున్నాయన్నారు. 8గంటల పనిదినం అనే చా రిత్రక పోరాట స్ఫూర్తిని చెరిపివేసేలా 10 గంట లు 12 గంటల పని విధానా లను కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని పేర్కొన్నారు. లే బర్‌కోడ్‌ల ద్వారా ఈ ఎస్‌ఐ, పీ ఎఫ్‌, పెన్షన్‌ ప్రసూతి ప్రయో జనాలు వంటి కార్మిక హక్కు లు బలహీనపడుతున్నాయ న్నారు. కార్మికులకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామ న్నారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు నరేష్‌, యూటీఎఫ్‌ జిల్లా అ ధ్యక్షుడు ఆర్‌ కృష్ణ, ప్రజాకళాకారుడు గోపాల్‌, నారాయణ, నిరంజన్‌, జాంగీర్‌ పాల్గొన్నారు.

ఫ కొల్లాపూర్‌లో సీఐటీయూ జిల్లా ఉపాధ్య క్షుడు శివవర్మ ఆధ్వర్యంలో కొల్లాపూర్‌లో ఆర్డీవో కార్యాలయం నుంచి ఎన్టీఆర్‌ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైతు సంఘం మండల కార్యదర్శి బాలపీర్‌ అధ్యక్షతన జరిగిన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ ఐ జిల్లా అధ్యక్షుడు శివ శంకర్‌, ఆవాజ్‌ జిల్లా క న్వీనర్‌ సలీం, కేవీపీఎస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు బ త్తిని రాజు, రామకృష్ణ పాల్గొన్నారు. ఫ కల్వకు ర్తిలో సార్వత్రిక సమ్మె వి జయవంతమైంది. సమ్మె లో సీఐటీయూ అనుబం ధ సంఘాలు, అంగన్‌వా డీ, ఆశా, మధ్యాహ్న భో జన పథకం, గ్రామ పం చాయతీ, మునిసిపల్‌, భవన నిర్మాణ కార్మిక సంఘం, హమాలీ, ఆర్టీసీ, ఎల్‌ఐసీ, వివిధ సం ఘాల ఉద్యోగులు, కార్మికులు సమ్మెలో పాల్గొన్నా రు. సీఐటీయూ రాష్ట్ర నాయకులు కూరపాటి రమేష్‌ హాజరై మాట్లాడారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బి.ఆంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లాఅధ్యక్షుడు సి.ఆంజనేయులు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చిలుక బాల్‌రెడ్డి, ఎల్‌ ఐసీ ఐసీయూ కల్వకుర్తి డివిజన్‌ అధ్యక్షుడు లక్ష్మ ణాచారి, వివిధ సంఘాల నాయకులు పాల్గొ న్నారు. ఫ చారకొండలో ఏఐటీయూసీ మండల కార్యదర్శి మొగిళ్ల శ్రీను ఆధ్వర్యంలో జరిగిన స మ్మెలో కార్మికులు పాల్గొన్నారు. సీపీఐ జిల్లా నా యకులు డాక్టర్‌ చిలివేరు శ్రీనివాసులు, అశోక్‌ గౌడ్‌ హాజరై మాట్లాడారు. ఫ తిమ్మాజిపేటలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మద్యం డిపో ముం దు హమాలీల సంఘం నాయకులు నిరసన వ్య క్తం చేస్తూ బంద్‌ పాటించారు. బీఆర్‌ ఎస్‌ మం డల అధ్యక్షుడు జోగుప్రదీప్‌, సర్పంచ్‌ హుస్సేనీ నాయక్‌, మాజీ సర్పంచ్‌ వేణుగోపాల్‌గౌడ్‌, మా జీ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ కొత్త వెంకటేశ్‌, సీపీఐ ఖాజామైనొద్దీన్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2026 | 11:31 PM