kumaram bheem asifabad-కేంద్రంలో లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి
ABN , Publish Date - Feb 12 , 2026 | 11:13 PM
కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల మీద యుద్దం మొదలు పెట్టిందని 2019 నుంచి ఈ యుద్దం కొనసాగుతుందని అన్నారు. 29 రకాల కార్మిక చట్టాలను బ్రిటీష్ కాలం నుంచి పోరాడి కార్మికులు సాధించుకున్న చట్టాలను యజమాన్యాలకు అనుకూలంగా మోడి ప్రభుత్వం రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకు వచ్చిందని అన్నారు.
ఆసిఫాబాద్‌రూరల్, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల మీద యుద్దం మొదలు పెట్టిందని 2019 నుంచి ఈ యుద్దం కొనసాగుతుందని అన్నారు. 29 రకాల కార్మిక చట్టాలను బ్రిటీష్ కాలం నుంచి పోరాడి కార్మికులు సాధించుకున్న చట్టాలను యజమాన్యాలకు అనుకూలంగా మోడి ప్రభుత్వం రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్‌లను తీసుకు వచ్చిందని అన్నారు. వెంటనే వాటిని రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేందర్, దినకర్, కార్తీక్, రాజు, ఉపేందర్, తిరుపతి, వనిత, సునీత, సమ్మయ్య, నవీన్, జ్యోతి, సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు. అలాగే విద్యుత్ శాఖ ఏఈ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఐ జాడె ఉత్తం, ఎస్‌ఏఓ దేవిదాస్, జాక్ నాయకులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్, (ఆంధ్రజ్యోతి): సార్వత్రిక సమ్మెలో భాగంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సీఐటీయూ సీనియర్ నాయకుడు ముంజం శ్రీనివాస్. జిల్లా కోశాధికారి శంకర్, ప్రధాన కార్యదర్శి కూషన రాజన్న, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
తిర్యాణి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో డీవైఎఫ్‌వై, సీఐటీయూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్మవహించారు. అనంతరం కుమరం భీం చౌరస్తాలో నిరసన తెలిపారు. కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ నాయకులు టికానంద్, సీఐటీయూ నాయకులు శంకర్, వెంకేశంగౌడ్, విజయ్, తిరుపతి, జంగు, తదితరులు పాల్గొన్నారు.
కెరమెరి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిం చారు. అనంతరం మానవహారం నిర్వహించారు. క్యాక్రమంలో నాయకులు ఆనంద్‌రావు, రమేష్, సంతోష్, శంకర్, ప్రమీల, మంజుల, కవిత, సావిత్రి, శ్రీనివాస్, రాధాబాయి, దినేష్, రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.
బెజ్జూరు, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కృష్ణమాచారి, వసంత్, అనంతరావు, రాజేశ్వర్, స్వప్న, బాయక్క, వినోద, రోజ, వైశాలి, బాయక్క, పద్మ, సువర్ణ, విజయ, కళావతి పాల్గొన్నారు.
చింతలమానేపల్లి, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, కర్షక ప్రజా వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీలత, విలాస్, విలాస్, నిర్మల, తారాబాయి తదితరులు పాల్గొన్నారు.
రెబ్బెన, (ఆంధ్రజ్యోతి): దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను ఉపసంహరించుకోవాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని, కార్మిక రంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రెబ్బెన తహసీల్దార్‌కు ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు చిరంజీవి, సీఐటీయూ నాయకులు శ్రీకాంత్, రమేష్, రాజేశ్వరి, మాయ, తదితరులు పాల్గొన్నారు.
దహెగాం, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో రనార్యలీ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు వజ్రమ్మ, పార్వతి, మమత, శోభ, మహేశ్వరి, రాజం, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
సిర్పూర్, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ర్యాలీ, బస్టాండ్ ఆవరణలో రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో సీఐటీయూ, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కౌటాల, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జైనూర్, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో అంగన్‌వాడీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు తార, గంగామణి, మడావి కొద్దు, దివ్య జ్యోతి, రవిందర్, సీతబాయి, ఓమల, గేడాం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
సిర్పూర్(యు), (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో ప్రజా సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు.