Minister Damodara Rajanarsimha: టీవీవీపీ ఉద్యోగులకు ట్రెజరీ వేతనాలు
ABN , Publish Date - Jan 09 , 2026 | 05:03 AM
తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) ఉద్యోగులకు త్వరలోనే 010 పద్దు(ట్రెజరీ) నుంచి వేతనాలను అమలు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు....
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) ఉద్యోగులకు త్వరలోనే 010 పద్దు(ట్రెజరీ) నుంచి వేతనాలను అమలు చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రకటించారు. గురువారం వైద్య విధాన పరిషత్ ఉద్యోగుల జేఏసీ ప్రచురించిన నూతన క్యాలెండర్‌ను మంత్రి రాజనర్సింహ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్‌ను అమలు చేయడానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. దీంతో జేఏసీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేసి, స్వీట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వానికి, మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
10న ల్యాబ్‌టెక్నీషియన్లకు నియామక పత్రాలు
గాంధీ వైద్య కళాశాలలో ఈ నెల 10న ఏర్పాటు చేసే కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్లుగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నట్టు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-2 పోస్టులకు 1,248 మంది అభ్యర్థులు ప్రాథమికంగా ఎంపికైనట్టు ప్రభుత్వం గతంలో ప్రకటించింది. వారికి నియామక పత్రాలు అందించనున్నట్టు మంత్రి పేర్కొన్నారు.