Share News

‘కేవైసీ’లో నిర్లక్ష్యంతోనే మ్యూల్‌ ఖాతాలు

ABN , Publish Date - Apr 22 , 2026 | 05:21 AM

సైబర్‌ నేరాలను అరికట్టాలంటే బ్యాంకింగ్‌ వ్యవస్థలో సమూల ప్రక్షాళన జరగాలని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అన్నారు. వందల కేసుల్లో...

‘కేవైసీ’లో నిర్లక్ష్యంతోనే మ్యూల్‌ ఖాతాలు

  • నేరగాళ్లకు సహకరించే బ్యాంకు అధికారులను బ్లాక్‌లిస్టులో పెట్టాలి.. ఆర్బీఐ గవర్నర్‌కు సీపీ సజ్జనార్‌ లేఖ

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరాలను అరికట్టాలంటే బ్యాంకింగ్‌ వ్యవస్థలో సమూల ప్రక్షాళన జరగాలని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ అన్నారు. వందల కేసుల్లో సైబర్‌ నేరస్థులకు బ్యాంకు అధికారులే సహకరిస్తున్నట్లు తేలిందన్నారు. ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రాకు లేఖ రాసినట్లు తెలిపారు. అమాయకుల పేర్లతో సృష్టిస్తున్న ‘మ్యూల్‌ ఖాతాలు’ సైబర్‌ మోసాలకు కేంద్ర బిందువుగా మారాయని పేర్కొన్నారు. పోలీసులు చేపట్టిన ‘ఆపరేషన్‌ ఆక్టోప్‌స’లో వెలుగుచూసిన విషయాలను లేఖలో వివరించారు. ఖాతాలు తెరిచే సమయంలో కేవైసీ ధ్రువీకరణలో జరుగుతున్న నిర్లక్ష్యాన్ని ప్రస్తావించారు.

Updated Date - Apr 22 , 2026 | 05:21 AM