క్యాతనపల్లి కౌన్సిల్ సమావేశం రద్దు
ABN , Publish Date - Sep 29 , 2026 | 11:42 PM
క్యాతనపల్లి మున్సి పాలిటీ పాలకవర్గ సమావేశం మంగళవారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా సమా వేశం రద్దు అయ్యింది. చైర్‌పర్సన్ గొడిసెల సంధ్యారాణి, వైస్ చైర్‌పర్సన్, బీఆర్‌ఎస్ కౌన్సి లర్లు సమావేశానికి హాజరయ్యారు.
-ఎజెండా చెప్పడం లేదంటూ బహిష్కరించిన కాంగ్రెస్ కౌన్సిలర్లు
-కమిషనర్‌ను బదిలీ చేయాలని చైర్‌పర్సన్, కౌన్సిలర్ తీర్మానం
మందమర్రిటౌన్(రామకృష్ణాపూర్), సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : క్యాతనపల్లి మున్సి పాలిటీ పాలకవర్గ సమావేశం మంగళవారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా సమా వేశం రద్దు అయ్యింది. చైర్‌పర్సన్ గొడిసెల సంధ్యారాణి, వైస్ చైర్‌పర్సన్, బీఆర్‌ఎస్ కౌన్సి లర్లు సమావేశానికి హాజరయ్యారు. అనంతరం వచ్చిన కాంగ్రెస్ కౌన్సిలర్లు చైర్‌పర్సన్ తమ కు ఎజెండా చెప్పడం లేదంటూ సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. అనంతరం కౌన్సిల్ సమావేశంలో బీఆర్‌ఎస్, సీపీఐ పార్టీ కౌన్సిలర్లు కమిషనర్ మురళీకృష్ణ తీరుపై ఆ గ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ హాలు బయట విలేకరులతో చైర్‌పర్సన్ గొడిసెల సంధ్యారా ణి, వైస్ చైర్‌పర్సన్ సరిత మాట్లాడుతూ రెండు నెలలుగా కమిషనర్ ఏకపక్షంగా వ్యవ హరిస్తున్నాడని, పాలకవర్గాన్ని ప్రజల్లో చులకన చేసే ప్రక్రియ చేపడుతున్నారని తెలిపారు. త్వరలోనే బతుకమ్మ సంబరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేయాలని క మిషనర్‌కు విన్నవించగా తనకేం సంబంధం లేనట్లుగా వ్యవహరించాడన్నారు. అభివృద్ధి ప నులకు సంబంధించి తమకేమి సమాచారం ఇవ్వకుండానే కమిషనరే పనులను మొదలు పెడుతున్నాడన్నారు. ఈ కమిషనర్ తమకు వద్దని తీర్మానించామని, ఉన్నతాధికారులు కమిషనర్‌ను బదిలీ చేయాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్, సీపీఐ కౌన్సిలర్లు పాల్గొన్నారు.
-విధులకు ఆటంకం కలిగిస్తున్నారు -
తాను క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చైర్‌ప ర్సన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు తనపై లేని పోని ఆరోపణలు చేస్తూ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ పేర్కొన్నారు. వార్డుల్లోని సమస్యలను పరి ష్కరించేందుకు వెళితే తన విధులను ఆటంకం కలిగిస్తున్నారన్నారు.
మందమర్రిటౌన్ : కమిషనర్ మురళీకృష్ణను బదిలీ చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామ డుగు లక్ష్మణ్ కోరారు. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పాలక వర్గానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడన్నారు. ఈ విషయంపై మంత్రితో పాటు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయనున్నామని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ కౌన్సిలర్లు, నాయకులు లింగయ్య, పౌలు, అక్బరలీ పాల్గొన్నారు.