‘కుర్చీ మడతపెట్టి’ తాత మృతి
ABN , Publish Date - May 21 , 2026 | 03:12 AM
ఆ కుర్చీని మడత పెట్టి’ అనే డైలాగ్‌తో ప్రాచుర్యం పొందిన షేక్ అహ్మద్ పాషా (64) అలియాస్ కుర్చీ తాత అస్వస్థతకు గురై మృతి చెందాడు.
యూసుఫ్‌గూడ, మే 20 (ఆంధ్రజ్యోతి): ‘ఆ కుర్చీని మడత పెట్టి’ అనే డైలాగ్‌తో ప్రాచుర్యం పొందిన షేక్ అహ్మద్ పాషా (64) అలియాస్ కుర్చీ తాత అస్వస్థతకు గురై మృతి చెందాడు. హైదరాబాద్‌లోని కృష్ణకాంత్ పార్కులో మంగళవారం సాయంత్రం వాకింగ్ చేస్తూ ఎండ తీవ్రతకు పాషా సొమ్మసిల్లి పడిపోయాడు. గమనించిన వాకర్స్.. ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా.. ప్రాథమిక చికిత్స చేయించి పాషాను ఇంటికి తీసుకెళ్లారు. అయితే, బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన పాషా తన భార్య ఆసియా సుల్తానా ఒడిలో తలపెట్టి ప్రాణాలు విడిచారు. పాషా అంత్యక్రియలు గురువారం జరగనున్నాయి. వరంగల్‌లోని కరీమాబాద్‌కు చెందిన పాషా 40 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చాడు. పాషాకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.