రైతు ఆత్మహత్య
ABN , Publish Date - Jul 17 , 2026 | 06:13 AM
తాము సాగుచేస్తున్న భూమి విషయంలో మరొకరు వేధింపులకు గురిచేయడంతో మనస్తాపం చెందిన ఓ యువరైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
కుమురం భీం జిల్లాలో ఘటన
సిర్పూరు(టి), నల్లబెల్లి, జూలై 16 (ఆంధ్రజ్యోతి): తాము సాగుచేస్తున్న భూమి విషయంలో మరొకరు వేధింపులకు గురిచేయడంతో మనస్తాపం చెందిన ఓ యువరైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమురం భీం జిల్లా సిర్పూర్ (టీ) మండలంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. హీరాపుర్ గ్రామానికి చెందిన టేకం పెంటు (22) తండ్రి టేకం చీకటి గ్రామ శివారులోని నాలుగు ఎకరాల భూమిని సుమారు 50 ఏళ్లుగా సాగు చేస్తున్నాడు. కాగా, ఆ భూమిని తాను కొనుగోలు చేశానని, దానిని ఖాళీ చేసి వెళ్లిపోవాలని కాగజ్‌నగర్‌కు చెందిన కొక్కెర్ల వేణుగోపాల్ అనే వ్యక్తి టేకం చీకటి కుటుంబాన్ని కొన్నిరోజులుగా వేధిస్తున్నాడు. ఇటీవల అతడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు విచారణ నిమిత్తం టేకం చీకటిని బుధవా రం స్టేషన్‌కు పిలిపించారు. తన తండ్రిని పోలీసులు పిలిచారని, తమ భూమి పోతుందని తీవ్ర మనస్తాపం చెందిన టేకం పెంటు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివాసీ సంఘం నేతలు, బాధిత కుటుం బ సభ్యుల ఆందోళనతో నిందితుడు వేణుగోపాల్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమో దు చేసినట్లు సీఐ సంతోష్ తెలిపారు.
అప్పుల భారంతో...
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండ లం శనిగరంలో రైతు ముప్పా ల దేవేందర్ (35)ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు తీర్చలేకనే ఉరేసుకున్నాడు.