kumaram bheem asifabad-కుంకుమార్చనలు.. ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Oct 17 , 2026 | 11:41 PM
దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అయా మండపాల వద్ద కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు, అన్నదా నాలు కొనసాగుతున్నాయి. బజారువాడి హనుమాన్ మందిర్లో అర్చకుడు ఉపేందర్ ఆధ్వర్యంలో మహిళలచే కుంకుమార్చన చేయించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అ
ఆసిఫాబాద్రూరల్/రెబ్బెన, కాగజ్నగర్/దహెగాం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అయా మండపాల వద్ద కుంకుమార్చనలు, ప్రత్యేక పూజలు, అన్నదా నాలు కొనసాగుతున్నాయి. బజారువాడి హనుమాన్ మందిర్లో అర్చకుడు ఉపేందర్ ఆధ్వర్యంలో మహిళలచే కుంకుమార్చన చేయించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అలాగే పైకాజీనగర్, సాయినగర్ కాలనీలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. అయా కార్యక్రమాల్లో నిర్వహకులు పాల్గొన్నారు. రెబ్బెన మండలంలోని ఇందిరనగర్లోని శ్రీ మహాంకాలి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శనివారం శ్రీ మహాలక్ష్మిదేవిగా ఆవతరంలో భక్తులకు తల్లి దర్శనమిచ్చింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆలయ పూజారి దేవర వినోద్ నిర్వహించారు. కాగజ్నగర్ త్రినేత్ర శివాలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో భక్తులు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు. దహెగాం మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర ఆలయంలో దుర్గదేవి నవరాత్రుల్లో శనివారం కరెన్సీతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.