kumaram bheem asifabad- ఘనంగా కుమరం సూరు వర్ధంతి
ABN , Publish Date - Oct 30 , 2026 | 10:43 PM
మండల కేంద్రంలో కురం సూరు వర్ధంతిని కొలాం ఆదివాసీలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భాజాభజంత్రీలతో, కొలాం ఆదివాసీలు కుమరం భీం, అంబేద్కర్, చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులు ఆర్పించారు. ఆనంతరం ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా తరలి వచ్చి మార్కెట్ కమిటీ సమీపంలో కుమరం సూరు జెండాను ఆవిష్కరించారు. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్, సీనియర్ నాయకులు మేస్రాం అంబాజీ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షేక్ రషీద్, సర్పంచులు కొడప ప్రకాష్, ఆత్రం తులసీ శంకర్, ఆత్రం అయ్యుబాయి భుజంగ్‌రావ్ మూడు మండలాల జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్ మూడు మండలాల కొలాం సంఘం అధ్యక్షులు ఆత్రం బాపూరావ్, గౌరవ అధ్యక్షులు రాజు తదితరులు కుమరం సూరు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు ఆర్పించారు.
జైనూర్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో కురం సూరు వర్ధంతిని కొలాం ఆదివాసీలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భాజాభజంత్రీలతో, కొలాం ఆదివాసీలు కుమరం భీం, అంబేద్కర్, చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులు ఆర్పించారు. ఆనంతరం ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా తరలి వచ్చి మార్కెట్ కమిటీ సమీపంలో కుమరం సూరు జెండాను ఆవిష్కరించారు. డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్, సీనియర్ నాయకులు మేస్రాం అంబాజీ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు షేక్ రషీద్, సర్పంచులు కొడప ప్రకాష్, ఆత్రం తులసీ శంకర్, ఆత్రం అయ్యుబాయి భుజంగ్‌రావ్ మూడు మండలాల జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్ మూడు మండలాల కొలాం సంఘం అధ్యక్షులు ఆత్రం బాపూరావ్, గౌరవ అధ్యక్షులు రాజు తదితరులు కుమరం సూరు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు ఆర్పించారు. అనంతరం స్థానిక మార్కెట్ కమిటీ యార్డులో బహిరంగ సభ నిర్వహించారు. సమాచార శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన కళాజాతా, సంస్ర్కుతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొలాం సంఘం జిల్లా అధ్యక్షుడు ఆత్రం తిరుపతి మాట్లాడుతూ అనాటి కాలంలో ఆదివాసీల హక్కుల కోసం ఉద్యమ బాట పట్టిన పోరాట యోధులు కుంరంభీంకు సహచరుడిగా కుంరం సూరు ఉద్యమించారని కొనియాడారు. కార్యక్రమంలో కొలాం సంఘం జిల్లా జనరల్ సెక్రెటరీ వసంత్‌రావ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆత్రం భుజంగ్‌రావ్, మాజీ సర్పంచులు సిడాం భీంరావ్, ఆత్ర రాజు, దేవారి ముతబాయి, నాయకులు టేకం భాస్కర్, ఆత్రం భీంరావ్, టేకం బాపూరావ్, మడావి ము త్త, కాంగ్రెస్ పార్టీ జనరల్ జిల్లా జనరల్ సెక్రెటరీ రహీం, కాంబ్లే అమృత్, వార్డు సభ్యులు భుతాలె కిరణ్, కళాజాత టీం లీడర్ మొహన్ నాయక్ పాల్గొన్నారు. వర్ధంతికి వచ్చిన ప్రజలకు అన్నదానం చేశారు సీఐ రమేశ్ పర్యవేక్షణలో ఎస్సై గోదరి రవికుమార్ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.