హక్కుల సాధనకు పోరాడిన వీరుడు కుమరం భీం
ABN , Publish Date - Nov 01 , 2026 | 10:03 PM
అడవి బిడ్డల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పి, వారి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడిన వీరుడు కొమురం భీం అని ఆయన పోరాట స్ఫూర్తి ఆదివాసి సమాజానికి ఎప్ప టికీ మార్గదర్శకమని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. ఆ
జల్ జంగల్ జమీన్ నినాదం తరతరాలకు స్ఫూర్తిదాయకం
కుమరం భీం విగ్రహాష్కరణలో ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు
దండేపల్లి,నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): అడవి బిడ్డల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పి, వారి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడిన వీరుడు కొమురం భీం అని ఆయన పోరాట స్ఫూర్తి ఆదివాసి సమాజానికి ఎప్ప టికీ మార్గదర్శకమని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. ఆదివారం దండేపల్లిలో నూతనంగా ఏర్పాటు చే సిన కొమురం భీం విగ్రహాన్ని కలెక్టర్ కుమార్ దీపక్, ఉ ట్నూర్ ఐటీడీఏ పీవో మంద మకరంద్, డీసీపీ భాస్కర్‌తో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఆదివాసి గిరిజనులు, గుస్సాడి వేషధారణతో వారికి ఘన స్వాగతం పలికారు. ముందుగా గిరిజన సంఘాల నాయకులు జెండా ఆవిష్క రించి, భీంకు ప్రత్యేక పూజలను గిరిజన సం ప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చే సిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజాం నిరం కుశ పాలనకు వ్యతిరేకంగా, అడవి బిడ్డల హక్కుల పరి రక్షణ కోసం కుమరంభీమ్ అందించిన జల్ జంగల్ జ మీన్ (నీరు అడవి, భూమి) నినాదం చరిత్ర పుటల్లో చి రస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ఆదివాసిల ఆత్మగౌవరం అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గి రిజన కుటుంబాలకు ఆదాయ వర్గాలు కల్పించేందుకు 200కుటుంబాలకు ఆయిల్‌పామ్ సాగు చేసే అవకాశాల ను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని రూ 3కో ట్లతో 100 మంది విద్యార్థులకు వసతి కల్పించే వసతి గృ హం నిర్మిస్తున్నామన్నారు. పద్మల్ పూరీ కాకో ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, పెద్దయ్య ఆలయ అభివృద్ధి విషయంలో అటవీశాఖనిబంధనలను గౌరవి స్తూ, భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసు కుంటామన్నారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ కు మరం భీం పోరాట పటిమ భారతదేశ చరిత్రలోనే అపూ ర్వమైనదని కొనియాడారు. ఊట్నూర్ ఐటీడీఏ పీవో మం ద మకరంద్ మాట్లాడుతూ పోరాటయోధుడు కుమరం భీం స్పూర్తితో ఆదివాసీ గ్రామాల సర్వతోముఖాభి వృద్ధికి ఐటీడీఏ ద్వారా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నా మన్నారు. డీసీపీ భాస్కర్ మాట్లాడుతూ అన్యాయాన్ని ఎ దిరించి హక్కుల సాధన కోసం పోరాడిన మహనీయు డు కుమరం భీం అని కొనియాడారు. కార్యక్రమంలో డీ సీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖ, లక్షెట్టిపేట మార్కెట్ క మిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర్లు, గ్రామ సర్పంచ్ అజ్మీర రాజేశ్వర్‌నాయక్, పీఏసీఎస్ ఛైర్మన్ ముత్యాల శ్రీనివాస్, ఆర్‌జీపీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు త్రిమూర్తి, పీఏసీఎస్ వైస్ ఛైర్మన్ బిల్లకురి శంకరయ్య, ఆదివాసి సంఘా ల నాయకులు దౌలత్‌రావు, జంగు, శ్రీనివాస్, గోపి, పాల్గొన్నారు.