Share News

సీఎం సభతో కేటీఆర్‌ వెన్నులో వణుకు

ABN , Publish Date - Sep 29 , 2026 | 12:22 AM

సిరిసిల్ల సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన బండారాన్ని బయట పెడతారని కేటీఆర్‌ వెన్నులో వణుకు పుడుతోందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం సిరిసిల్లలో కేటీఆర్‌ బహిరంగ లేఖపై స్పందిస్తూ కంగారుతో రాసిన కంగాలి లేఖగా భావిస్తున్నామని అన్నారు. భయంతోనే పాత చింతకాయ పచ్చడి, కొత్త సీసాలో పాత సారా సామెత లాగా

సీఎం సభతో కేటీఆర్‌ వెన్నులో వణుకు
మాట్లాడుతున్న విప్‌ ఆది శ్రీనివాస్‌

సిరిసిల్ల, సెప్టెంబరు 28 (ఆంరఽధజ్యోతి): సిరిసిల్ల సభలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన బండారాన్ని బయట పెడతారని కేటీఆర్‌ వెన్నులో వణుకు పుడుతోందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం సిరిసిల్లలో కేటీఆర్‌ బహిరంగ లేఖపై స్పందిస్తూ కంగారుతో రాసిన కంగాలి లేఖగా భావిస్తున్నామని అన్నారు. భయంతోనే పాత చింతకాయ పచ్చడి, కొత్త సీసాలో పాత సారా సామెత లాగా కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చెబుతున్న మాటల్ని లేఖ రూపంలో పెట్టాడని అన్నారు. సిరిసిల్ల నేతన్నల బతుకుల్లో ఏం మార్పు తీసుకొచ్చావో చెప్పాలని అన్నారు. రూ. 370 కోట్లు నేతన్నలకు బకాయిలు పెట్టిన వాటికి సమాధానం చెప్పాలని, కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత బకాయిలు చెల్లించామని అన్నారు. నేతన్నలకు చేతినిండా పనికల్పిస్తున్నామని తెలిపారు. పేద ప్రజల చేతుల్లో ఉండాల్సిన భూములు, ప్రభుత్వ ఖాతాలో ఉండాల్సిన భూములు, గత ప్రభుత్వ హయాంలో బీఆర్‌ఎస్‌ నాయకులకు దోచి పెట్టారని, వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేశామని అన్నారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌ దళితుల భూములు, రంగనాయకసాగర్‌ ఇరిగేషన్‌ భూములు ఏ ప్రాజెక్టు దగ్గరకు వెళ్లినా కన్నుచూపు మేరలో నీరు ఉంటుందని రంగనాయకసాగర్‌ దగ్గర ‘యు‘ ఆకారంలో నీరు ఉంటుందని మధ్యలో ఫామ్‌ హౌస్‌ ఉండడం ఎలా సాధ్యమైందో హరీష్‌రావు చెప్పాలని అన్నారు. మొయినాబాద్‌, అజీజ్‌నగర్‌ , జన్వాడలో ఫిరంగి నాల మీద ఫామ్‌ హౌస్‌ల నిర్మాణాలతో లాబ్రేక్‌ చేశారని అన్నారు. మున్సిపల్‌ శాఖ మంత్రిగా అనుమతులు లేని కట్టడాలలో ఫిరంగి నాలా దగ్గర ఎట్లా నివాసం ఉంటున్నావని, మాఫీ ఇనాం, ఇనాం భూములు షాబాద్‌ మండలం, మద్దూరులో కూడా పేదలకు చెందాల్సిన భూములు 22ఎను అడ్డుపెట్టుకొని బడాబాబుల చేతుల్లోకి వెళ్లాయన్నారు. మనం పురాణాల్లో విన్నాం... మూడు అడుగుల కథ. మొదటి అడుగు సిరిసిల్లలో పడుతుంది, రెండో అడుగు సిద్దిపేటలో, మూడో అడుగు గజ్వేల్‌లో పడుతుందన్నారు. ముంపు గ్రామాలకు కేసీఆర్‌ రూ. 5 లక్షలు ఇస్తానని రూపాయి ఇవ్వలేదనిఅన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 4,900 మందికి రూ.234 కోట్లు మంజూరు చేసి చిత్తశుద్ధి నిరూపించుకున్నామని అన్నారు. కేటీఆర్‌ ప్రాయశ్చిత్తం చేసుకోవాలని అంటున్నాడని కానీ తండ్రి, కొడుకులు. వేములవాడ రాజన్న దగ్గర లగ్గం అయిందని చెప్పి రూ.100 కోట్లు ఇస్తున్నానని, తర్వాత రూ. 500 కోట్లు అని చెప్పి ఐదు పైసలన్నా ఇచ్చారా అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 250 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా సుమారు 340 కోట్ల రూపాయల నిధులతో శంకుస్థాపనలు చేసుకోబోతున్నామని అన్నారు. ఆయన వెంట సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి తదితరులు ఆన్నారు.

Updated Date - Sep 29 , 2026 | 12:24 AM