Share News

ఆ అధికారుల పేర్లు రాసిపెట్టుకుంటాం

ABN , Publish Date - Apr 12 , 2026 | 04:12 AM

ఫ్యూచర్‌ సిటీ పేరుతో హైదరాబాద్‌ శివారు మొదలుకొని ఆమన్‌గల్లు వరకు భూములను కొల్లగొట్టి సీఎం రేవంత్‌రెడ్డి అన్నదమ్ములు, బంధువులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని ...

ఆ అధికారుల పేర్లు రాసిపెట్టుకుంటాం

  • మా ప్రభుత్వం వచ్చాక వారి సంగతి తేలుస్తాం: కేటీఆర్‌

ఇబ్రహీంపట్నం, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): ఫ్యూచర్‌ సిటీ పేరుతో హైదరాబాద్‌ శివారు మొదలుకొని ఆమన్‌గల్లు వరకు భూములను కొల్లగొట్టి సీఎం రేవంత్‌రెడ్డి అన్నదమ్ములు, బంధువులు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. రేవంత్‌రెడ్డి లాంటి అరాచక పాలనను గతంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధి బొంగులూరులో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. అధికారులు బాధ్యతగా వ్యవహరించకపోతే వారి పేర్లు రాసి పెట్టుకొని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి సంగతి తేలుస్తామన్నారు. ఫ్యూచర్‌సిటీ భూముల్లో 3 వేల ఎకరాలు జూపార్కు కోసం అంటూ అంబానీకి కట్టబెట్టాలని చూస్తున్నారని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు.

Updated Date - Apr 12 , 2026 | 04:18 AM