Share News

పంటలు కొనాలని కాలర్‌ పట్టుకొని అడగాలి

ABN , Publish Date - Jun 21 , 2026 | 05:02 AM

హైదరాబాద్‌లోని అమెరికన్‌ కాన్సులేట్‌ ప్రధాన రహదారికి ‘డొనాల్డ్‌ ట్రంప్‌ అవెన్యూ’గా పేరు పెట్టాలని రేవంత్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వామపక్షాలు....

పంటలు కొనాలని కాలర్‌ పట్టుకొని అడగాలి

కాంగ్రెస్‌ నేతల ఇళ్ల ఎదుట ధర్నాలు చేయాలి: కేటీఆర్‌

ఆదిలాబాద్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని తాము రైతు బంధు పథకాన్ని తీసుకొస్తే.. కాంగ్రెస్‌ నాయకులు రాబందుల్లా మారి రైతులను చంపుతున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. పంటలు కొనాలని నాయకుల కాలర్‌ పట్టుకొని అడగాలని రైతులకు సూచించారు. కాంగ్రెస్‌ నేతల ఇళ్ల ఎదుట ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండలం పొన్న గ్రామానికి చెందిన రైతు పాండురంగ్‌ ఇటీవల జొన్న కొనుగోలు కేంద్రంలో ఆత్మహత్య చేసుకోగా.. ఆయన కుటుంబాన్ని శనివారం కేటీఆర్‌ పరామర్శించారు. ఆ కుటుంబానికి రూ.3లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్బంగా కేటీఆర్‌ మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు అష్ట కష్టాలు పడాల్సి వస్తోందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలతో రైతులు చిత్తవుతున్నారని, అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ పెట్టిన పథకాలు ఇష్టం లేకుంటే పేరు మార్చుకోవచ్చని, రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు వెంటనే చెల్లించాలన్నారు.

Updated Date - Jun 21 , 2026 | 05:02 AM