Share News

మునిసిపోల్‌లో గులాబీ జెండా ఎగరాలి:కేటీఆర్‌

ABN , Publish Date - Feb 04 , 2026 | 03:28 AM

రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల్లో గులాబీ జెండాఎగరాలని, పార్టీ అభ్యర్థుల గెలుపునకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు కృషిచేయాలని, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

మునిసిపోల్‌లో గులాబీ జెండా ఎగరాలి:కేటీఆర్‌

హైదరాబాద్‌, పిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల్లో గులాబీ జెండాఎగరాలని, పార్టీ అభ్యర్థుల గెలుపునకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు కృషిచేయాలని, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జులు, మునిసిపల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో మంగళవారం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ చేసిన ద్రోహాన్ని, హామీల అమలులో విఫలమైన తీరును ప్రజలు గమనిస్తున్నారని, అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకను ఆయుధంగా చేసుకొని క్షేత్రస్థాయిలో పనిచేయాలని సూచించారు. బీఆర్‌ఎ్‌సకు అనుకూల వాతావరణం నెలకొందని, ఈ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న వారం రోజుల పాటు పార్టీ శ్రేణులంతా సమన్వయంతో కష్టపడితే భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తంచేశారు.

Updated Date - Feb 04 , 2026 | 03:28 AM