‘రేవంత్‌రెడ్డి ఒక చిచోరా’..
ABN , Publish Date - Jul 21 , 2026 | 04:14 AM
‘‘ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియని వ్యక్తి రేవంత్‌రెడ్డి. ఆయన ఒక చిచోరా. ఖర్మ బాలేక ఆయన మనకి ముఖ్యమంత్రి అయ్యారు’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు.
ఆయనకు తెలిసింది ఢిల్లీకి మూటలు మోయడమే
గాచారం బాలేకనే కాంగ్రె్‌సలో పోచారం చేరిక : కేటీఆర్
హైదరాబాద్, జూలై 20 (ఆంధ్రజ్యోతి) : ‘‘ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియని వ్యక్తి రేవంత్‌రెడ్డి. ఆయన ఒక చిచోరా. ఖర్మ బాలేక ఆయన మనకి ముఖ్యమంత్రి అయ్యారు’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దుయ్యబట్టారు. బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మోరిల్ శ్రీనివాస్ సోమవారం ఆయన సమక్షంలో బీఆర్‌ఎ్‌సలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో డబ్బు దోచుకుని, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి కప్పం కట్టి, తన సీఎం సీటును రెన్యువల్ చేయించుకోవడం తప్ప రేవంత్‌కు ఇంకేమీ తెలియదన్నారు. ఎల్‌నినో వస్తుందని శాస్త్రవేత్తలు ఆరునెలల ముందే హెచ్చరించినా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. గులాబీ జెండాపై గెలిచిన పోచారం శ్రీనివా్‌సరెడ్డి గాచారం బాలేకనే కాంగ్రె్‌సలాంటి మునిగే పడవ ఎక్కారని ఎద్దేవా చేశారు.