KTR: ప్రశ్నించే గొంతుకలను వేధించేందుకే సిట్!
ABN , Publish Date - Jan 14 , 2026 | 07:24 AM
ప్రశ్నించే గొంతుకలైన టీవీ చానళ్లు, డిజిటల్ మీడియా సంస్థలను వేధించడానికే సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) గారడీలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు
ప్రజలదృష్టి మళ్లించేందుకు రేవంత్ సర్కార్ కొత్త డ్రామా: కేటీఆర్
హైదరాబాద్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): ప్రశ్నించే గొంతుకలైన టీవీ చానళ్లు, డిజిటల్ మీడియా సంస్థలను వేధించడానికే సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) గారడీలు చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. తమ పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే రేవంత్‌రెడ్డి సర్కారు సిట్ అంటూ కొత్త డ్రామాకు తెరలేపిందని మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఒక టీవీ ఛానెల్ ఒక మంత్రిపై వేసిన వార్తాకథనాన్ని ఉటంకించినందుకే అనేక ఇతర ఛానెళ్లు, డిజిటల్ మీడియా హ్యాండిళ్లపై దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం సిట్ ఏర్పాటుచేయడం విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడుతున్న మంత్రులు, వారి కుటుంబ సభ్యులపై విచారణ చేయడానికి సిట్ ఉండదా? అని ప్రశ్నించారు. కాగా, న్యూయార్క్ నగరంలోని కొలంబియా బిజినెస్ స్కూల్ (సీబీఎ్‌స)లో ఈఏడాది ఏప్రిల్ 4న జరగనున్న‘21వ వార్షిక ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనాలని బీఆర్‌ఎస్ వర్కింగ్‌ప్రెసిడెంట్ కేటీఆర్‌ను నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ సదస్సును నిర్వహించే విద్యార్థి విభాగం ‘సౌత్‌ఆసియా బిజినెస్ అసోసియేషన్ మంగళవారం ఆయన్ను ఆహ్వానిస్తూ.. లేఖను పంపింది.