ఉచిత విద్యుత్ ఎగ్గొట్టేందుకే రైతు డిస్కమ్
ABN , Publish Date - Jun 01 , 2026 | 04:31 AM
సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే గత ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను అమలు చేస్తేనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ...
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సికింద్రాబాద్, మే 31 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డికి దమ్ముంటే గత ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను అమలు చేస్తేనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రైతులకు 24గంటల ఉచిత విద్యుత్‌ను పూర్తిగా రద్దు చేసేందుకే ప్రత్యేకంగా రైతు డిస్కమ్ తీసుకొస్తున్నారని మండిపడ్డారు. చెప్పింది చేయకపోవడం, చేసింది చెప్పకపోవడం రేవంత్ నైజమని విమర్శించారు. బాలంరాయిలోని క్లాసిక్ గార్డెన్‌లో ఆదివారం జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్‌ఎస్ సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ప్రజలు రేవంత్ మోసపూరిత హామీలను నమ్మి, ఇప్పుడు బాధ పడుతున్నారన్నారు. 6లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని పొంగులేటి ప్రకటించారని, 6 మందికి ఇచ్చినట్టు నిరూపించినా రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు.