రియల్ ఎస్టేట్‌ను బొందపెట్టిన సీఎం: కేటీఆర్
ABN , Publish Date - Jun 26 , 2026 | 05:11 AM
హైదరాబాద్ రియల్‌ఎస్టేట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి పూర్తిగా గొయ్యితీసి బొంద పెట్టాడు’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
చేవెళ్ల, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): ‘హైదరాబాద్ రియల్‌ఎస్టేట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి పూర్తిగా గొయ్యితీసి బొంద పెట్టాడు’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఒకప్పుడు కోట్ల రూపాయలు పలికిన భూముల ధరలు ఇప్పుడు పూర్తిగా పడిపోయాయని అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం, ఎస్‌ఐఆర్‌పై నిర్వహించిన శిక్షణా తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రియల్‌ఎస్టేట్‌ను నమ్ముకుని బతికిన వేలాదిమంది ఇప్పుడు రోడ్డున పడ్డారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. షాబాద్ పరిసరాల్లో ఎకరా రూ.30లక్షలు ఉండేదని.. కేసీఆర్ హయాంలో పరిశ్రమలు రావడంతో ఎకరా రూ.3కోట్లుకు చేరిందని, ఇప్పుడు అమాంతం పడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు.పేదల ఇళ్లు కూలుస్తూ సీఎం పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ఇప్పటివరకు 72సార్లు ఢిల్లీకి వెళ్లినా.. 70పైసలు కూడా తీసుకురాలేదని ధ్వజమెత్తారు.