Share News

హైదరాబాద్‌లో విమర్శలు.. ఢిల్లీలో డ్రామాలు

ABN , Publish Date - Jun 24 , 2026 | 04:43 AM

మెట్రో రుణం, విస్తరణ విషయంలో హైదరాబాద్‌లో పరస్పరం విమర్శలు చేసుకున్న రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి... ఢిల్లీలో కలిసిమెలిసి తిరుగుతూ డ్రామాలు...

హైదరాబాద్‌లో విమర్శలు.. ఢిల్లీలో డ్రామాలు

  • ప్రజల దృష్టిని మళ్లిస్తున్న సీఎం రేవంత్‌, కిషన్‌రెడ్డి: కేటీఆర్‌

హైదరాబాద్‌ సిటీ/మియాపూర్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): మెట్రో రుణం, విస్తరణ విషయంలో హైదరాబాద్‌లో పరస్పరం విమర్శలు చేసుకున్న రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి... ఢిల్లీలో కలిసిమెలిసి తిరుగుతూ డ్రామాలు ఆడుతున్నారని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ఆరోపించారు. రేవంత్‌రెడ్డి కేంద్రాన్ని ఏదో అడిగినట్టు.. కిషన్‌రెడ్డి కేంద్రం నుంచి ఏదో తీసుకువచ్చినట్టు ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఎస్‌ఐఆర్‌పై శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ శ్రేణులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ మెట్రో స్వాధీనం పేరిట రాష్ట్ర ప్రజలపై రూ.14వేల కోట్ల అప్పును రుద్దుతున్న రేవంత్‌.. మెట్రోరైల్‌కు చెందిన రూ.30వేల కోట్ల విలువైన 250 ఎకరాల భూములను తన సోదరులు, బావమరిదికి అప్పజెప్పేందుకు పావులు కదుపుతున్నారని ధ్వజమెత్తారు. మెట్రోపై రేవంత్‌ ప్రేమ వెనుక భారీ కుంభకోణం ఉందని తెలిపారు. నిజంగానే కేంద్ర ప్రభుత్వానికి, కిషన్‌రెడ్డికి తెలంగాణ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే.. గతంలో లక్డీకాపూల్‌ నుంచి పటాన్‌చెరు వరకు ప్రతిపాదించిన మెట్రో ప్రాజెక్టు విస్తరణకు ఎందుకు ఆమోదం తెలపలేదని ప్రశ్నించారు.

Updated Date - Jun 24 , 2026 | 04:43 AM