కాంగ్రెస్ దరిద్రం తెలంగాణకు చుట్టుకుంది
ABN , Publish Date - Jun 03 , 2026 | 06:09 AM
అబద్ధాలు, అభూత కల్పనలు, విషప్రచారాలతో రాష్ట్ర రాజకీయాలను కాంగ్రెస్ కలుషితం చేస్తోందని, దేశమంతా వదిలించుకున్న ఆ పార్టీ దరిద్రం తెలంగాణకు....
బీఆర్‌ఎస్ ఒంటరిగానే పోటీచేసి గెలుస్తుంది: కేటీఆర్
హైదరాబాద్, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): అబద్ధాలు, అభూత కల్పనలు, విషప్రచారాలతో రాష్ట్ర రాజకీయాలను కాంగ్రెస్ కలుషితం చేస్తోందని, దేశమంతా వదిలించుకున్న ఆ పార్టీ దరిద్రం తెలంగాణకు చుట్టుకుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. అడ్డదారిలో వచ్చిన కాంగ్రెస్ తెలంగాణను 25 ఏళ్లు వెనక్కు నెట్టిందని, వడ్డించిన విస్తరిలాంటి రాష్ట్రాన్ని రేవంత్‌రెడ్డి కుక్కలు చింపిన విస్తరిగా మారుస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ విష ప్రచారాల వల్లే.. బీఆర్‌ఎస్ ఓటమి పాలైందని, ఎప్పుడైనా తమ పార్టీ ఒంటరిగానే పోటీచేసి గెలుస్తుందని చెప్పారు. రెండున్నరేళ్లలో 4000 కొత్త ఉద్యోగాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేదని, గతంలో అశోక్‌నగర్‌కు వచ్చి నిరుద్యోగులకు హామీ ఇచ్చిన సన్నాసి.. రాహుల్ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.