Share News

రైతన్నలకు వెన్నుపోట్లు.. రాహుల్‌కి వెయ్యికోట్లు!

ABN , Publish Date - Mar 17 , 2026 | 04:00 AM

తెలంగాణను ఏటీఎంలా మార్చి ఏఐసీసీకి సమర్పించడంలో కాంగ్రెస్‌ సర్కారుకు ఉన్న శ్రద్ధ.. పేదలమీద లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు.

రైతన్నలకు వెన్నుపోట్లు.. రాహుల్‌కి వెయ్యికోట్లు!

  • ఏఐసీసీకి ఏటీఎంలా తెలంగాణ: కేటీఆర్‌

హైదరాబాద్‌, మార్చి 16 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణను ఏటీఎంలా మార్చి ఏఐసీసీకి సమర్పించడంలో కాంగ్రెస్‌ సర్కారుకు ఉన్న శ్రద్ధ.. పేదలమీద లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. రైతన్నలకు వెన్నుపోట్లు పొడుస్తూ... రాహుల్‌ గాంధీకి రూ.వెయ్యికోట్లు ఇస్తామంటున్నారని, అన్నివర్గాలనూ మోసం చేస్తున్న ప్రభుత్వ తీరును ఎండగడతామని కేటీఆర్‌ హెచ్చరించారు. సోమవారం అసెంబ్లీకి వెళ్లే ముందు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గన్‌పార్క్‌ అమరవీరుల స్థూపంవద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని, మొదటి కేబినెట్‌ సమావేశంలో వీటికి చట్టబద్ధత కల్పిస్తామన్న రాహుల్‌గాంధీ హామీ నేటికీ అమలు కాలేదన్నారు.

Updated Date - Mar 17 , 2026 | 04:00 AM