అవినీతిని ప్రశ్నిస్తే శివ తాండవం చేస్తారా:కేటీఆర్
ABN , Publish Date - Mar 29 , 2026 | 06:34 AM
తెలంగాణలో తన స్కామ్‌లు, అవినీతి గురించి ప్రశ్నిస్తే సీఎం రేవంత్‌రెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణలో తన స్కామ్‌లు, అవినీతి గురించి ప్రశ్నిస్తే సీఎం రేవంత్‌రెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. శాసనసభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మైనింగ్ అక్రమాలను ప్రశ్నించినందుకు ప్రతిపక్షంపై బెదిరింపు ధోరణి ప్రదర్శించారన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ ఈ తరహా బెదిరింపులకు బీఆర్‌ఎస్ భయపడదని స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్టు పేరిట ఇళ్లను కూల్చివేసి.. 3000 ఎకరాల భూమి సేకరించి కార్పొరేట్ కంపెనీలకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. సీఎం అవినీతిని ప్రశ్నిస్తే శివతాండవం చేస్తానని మాట్లాడటం రేవంత్ అహంకారానికి నిదర్శనమని అన్నారు.