డ్రగ్స్ కేసులోకి బీఆర్‌ఎస్‌ను లాగొద్దు
ABN , Publish Date - Mar 16 , 2026 | 04:15 AM
నీచమైన రాజకీయాల కోసం డ్రగ్స్ కేసులోకి బీఆర్‌ఎ్‌సను లాగడం తగదని, చట్టవిరుద్ధ కార్యకలాపాలను, డ్రగ్స్ వాడకాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని....
నేను ఏ పరీక్షకయినా సిద్ధం: కేటీఆర్
హైదరాబాద్, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): నీచమైన రాజకీయాల కోసం డ్రగ్స్ కేసులోకి బీఆర్‌ఎ్‌సను లాగడం తగదని, చట్టవిరుద్ధ కార్యకలాపాలను, డ్రగ్స్ వాడకాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. డ్రగ్స్, అక్రమ పదార్థాల వాడకానికి వ్యతిరేకిగా ఉండే తన పేరును ప్రతి డ్రగ్స్ కేసులోకి లాగాలని చూస్తే చట్టపరమైన నోటీసులిస్తానని ఆదివారం ఎక్స్ వేదికగా ఆయన హెచ్చరించారు. మాదకద్రవ్యాలు మనుషులను రాక్షసులుగా మారుస్తాయని, బాధ్యతాయుత పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా డ్రగ్స్‌ను వాడటం దురదృష్టకరమన్నారు. డ్రగ్స్ వాడుతున్నవారు, విక్రయిస్తున్న వారినిరాజకీయాలతో సంబంధం లేకుండా చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు ఈ పరీక్షలు చేయించుకోవాలన్న మహేశ్‌గౌడ్ సూచనను స్వాగతిస్తున్నామని, అందరం ఈ పరీక్షలకు వచ్చి ఆదర్శంగా నిలుద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు.