ఇది విచారణ కాదు.. ప్రతీకారం: కేటీఆర్
ABN , Publish Date - Jan 30 , 2026 | 04:00 AM
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్‌కు సిట్ నోటీసు ఇవ్వడం దుర్మార్గమని, ఇది విచారణ కాదని.. ప్రతీకారమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.
హైదరాబాద్, జనవరి 29(ఆంధ్రజ్యోతి) :ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్‌కు సిట్ నోటీసు ఇవ్వడం దుర్మార్గమని, ఇది విచారణ కాదని.. ప్రతీకారమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. రైతు బంధు, రైతు బీమా, దళితబంధు వంటి పథకాలతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన విజనరీ నాయకుడికి నోటీసు ఇవ్వడం కక్ష సాధింపునకు నిదర్శనమన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు కేసీఆర్ అని, బెదిరింపులతో చరిత్రను చెరిపేయలేరని స్పష్టం చేశారు.