Share News

భల్లాలదేవుడికి పట్టిన గతే రేవంత్‌కు!

ABN , Publish Date - Jul 02 , 2026 | 04:38 AM

రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ రేవంత్‌ రెడ్డి పాలనపై కోపంగా ఉన్నారని, వారు అన్నీ గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో బాహుబలి సినిమాలో భల్లా...

భల్లాలదేవుడికి పట్టిన గతే రేవంత్‌కు!

  • ఆయన పాలనపై ప్రజలు కోపంగా ఉన్నారు: కేటీఆర్‌

హైదరాబాద్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ రేవంత్‌ రెడ్డి పాలనపై కోపంగా ఉన్నారని, వారు అన్నీ గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో బాహుబలి సినిమాలో భల్లాలదేవుడికి పట్టిన గతే రేవంత్‌కూ పడుతుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. తాను నమ్మిన హిట్లర్‌ కథ ఎలా ముగిసిందో రేవంత్‌ రాజకీయ జీవితానికి కూడా ప్రజలు అలాగే ముగింపు పలుకుతారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో బుధవారం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. తన రాష్ట్రం గురించి ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడని విధంగా రేవంత్‌ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎయిడ్స్‌రోగి, క్యాన్సర్‌ రోగి మాదిరిగా రాష్ట్రం దివాలా తీసిందంటూ తెలంగాణపైనే రేవంత్‌ విషం చిమ్ముతున్నారని విమర్శించారు. కేసీఆర్‌తో కూర్చుని చర్చ చేస్తే తన స్థాయి పెరుగుతుందని రేవంత్‌ అనుకుంటున్నారని, అందుకే రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉందని రేవంత్‌ చెబుతున్నారని విమర్శించారు.

Updated Date - Jul 02 , 2026 | 04:38 AM