Share News

రైతు గణపతిది.. సర్కార్‌ హత్యే: కేటీఆర్‌

ABN , Publish Date - Mar 23 , 2026 | 06:43 AM

ఆదిలాబాద్‌ జిల్లా ఆర్లీ (బీ) గ్రామానికి చెందిన రైతు తుడుం గణపతిది ఆత్మహత్య కాదని, ఇది ముమ్మాటికీ రేవంత్‌రెడ్డి సర్కార్‌ చేసిన హత్యేనని...

రైతు గణపతిది.. సర్కార్‌ హత్యే: కేటీఆర్‌

హైదరాబాద్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్‌ జిల్లా ఆర్లీ (బీ) గ్రామానికి చెందిన రైతు తుడుం గణపతిది ఆత్మహత్య కాదని, ఇది ముమ్మాటికీ రేవంత్‌రెడ్డి సర్కార్‌ చేసిన హత్యేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. రుణమాఫీ కాక, రైతుభరోసా రాక, అప్పుల బాధ తీవ్రమై మూడు రోజుల క్రితం గణపతి ఆత్మహత్య చేసుకున్నారని, ఆయన మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆదివారం ఎక్స్‌ వేదికగా ఆయన పేర్కొన్నారు.

Updated Date - Mar 23 , 2026 | 06:43 AM