ప్రజలు తిడుతుంటే పైశాచికానందమా?
ABN , Publish Date - Apr 30 , 2026 | 04:32 AM
ఒక వైపు ప్రజలు తిడుతుంటే, మరోవైపు ప్రజల పక్షాన సమస్యలు పరిష్కరించాలని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే పైశాచిక ఆనందం పొందుతారా?
సీఎం రేవంత్ రెడ్డి సిగ్గు పడాలి: కేటీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): ‘‘ఒక వైపు ప్రజలు తిడుతుంటే, మరోవైపు ప్రజల పక్షాన సమస్యలు పరిష్కరించాలని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే పైశాచిక ఆనందం పొందుతారా? కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలతో అన్యాయానికి గురవుతున్న వర్గాలు నిందిస్తుంటే సంతోషం కలుగుతుందంటారా? ఇలా మాట్లాడడానికి సీఎం రేవంత్‌రెడ్డి సిగ్గుపడాలి’’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం కల్వకుర్తికి చెందిన పలు పార్టీల నేతలు బీఆర్‌ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో గురుకుల విద్యార్థులు 140 మంది చనిపోయినా సీఎంకు పట్టింపులేదన్నారు. కోతల్లేకుండా కరెంట్ ఇవ్వలేకపోతున్నారని, రైతుబంధు రైతుల ఖాతాల్లో వేయలేకపోతున్నారని దుయ్యబట్టారు. పాలమూరు బిడ్డనని చెప్పుకొనే సీఎం.. కనీసం మహబూబ్‌నగర్ జిల్లాకు ఒక్క మంచిపనైనా చేశారా..? అని నిలదీశారు. కనీసం పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టులో మిగిలిన 10శాతం పనులనూ పూర్తి చేయలేదని విమర్శించారు.