Share News

Telangana: జిల్లాలను ముట్టుకుంటే అగ్గి పుట్టిస్తం..: కేటీఆర్

ABN , Publish Date - Jan 13 , 2026 | 07:29 AM

కేసీఆర్‌ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుచేసి అధికారులను ప్రజల వద్దకు తీసుకొస్తే.. జిల్లాలను శాస్త్రీయంగా ఏర్పాటు చేయలేదని...

Telangana: జిల్లాలను ముట్టుకుంటే అగ్గి పుట్టిస్తం..: కేటీఆర్

మహబూబ్‌నగర్‌/ జనగామ, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ‘కేసీఆర్‌ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుచేసి అధికారులను ప్రజల వద్దకు తీసుకొస్తే.. జిల్లాలను శాస్త్రీయంగా ఏర్పాటు చేయలేదని, రద్దుచేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి అంటున్నారు. ఏ జిల్లాను ముట్టినా అక్కడ బీఆర్‌ఎస్‌ అగ్గి పుట్టిస్తది. అదే కాంగ్రె్‌సను దహించివేస్తుంది’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమం సోమవారం మహబూబ్‌నగర్‌లో జరిగింది. కేటీఆర్‌ మాట్లాడుతూ పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేస్తే కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందని, అదే సమయంలో తన పాతబాసుకు కోపం వస్తుందన్న భయంతో సీఎం రేవంత్‌ ఉద్దేశపూర్వకంగానే దానిని పక్కనబెట్టారని విమర్శించారు. రైతులకు యూరియా బస్తా కూడా ఇవ్వలేని సీఎం.. మహిళలకు తులం బంగారం ఇస్తారా? అని ఎద్దేవా చేశారు. జిల్లాల పునఃవ్యవస్థీకరణ పేరుతో జనగామ జిల్లాను రద్దు చేయాలని చూస్తే జిల్లా అగ్నిగుండం అవుతుందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. పోరాడి సాధించుకున్న జనగామ జిల్లాను రద్దు చేయాలని చూస్తే ఇక్కడి ప్రజలు ఊరుకోరని స్పష్టంచేశారు.

Updated Date - Jan 13 , 2026 | 08:19 AM