రైతు బంధును బలహీనపరిచి..‘రాహుల్ బంధు’ మొదలెట్టారు: కేటీఆర్
ABN , Publish Date - Jun 14 , 2026 | 04:52 AM
తెలంగాణ ప్రభుత్వం రైతు బంధును బలహీనపరిచి ‘రాహుల్ బంధు’ను మొదలెట్టిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, వేములవాడ జూన్ 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం రైతు బంధును బలహీనపరిచి ‘రాహుల్ బంధు’ను మొదలెట్టిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతోపాటు వేములవాడలో బీఆర్‌ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు, బీఎల్‌ఏలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సీఎం రేవంత్ అన్ని రంగాల్లో వైఫల్యం చెందారని, కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తరుగు పేరుతో రైతులను మోసం చేస్తోందని, ఎరువుల దుకాణాల వద్ద రైతులు మళ్లీ క్యూలో నిలబడే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలుకు సంచులు లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే రాహుల్ గాంధీకి మాత్రం సంచుల్లో డబ్బులు వెళ్తున్నాయని ఆరోపించారు.