Share News

పెంచిన వాణిజ్య సిలిండర్‌ ధర తగ్గించాలి : కేటీఆర్‌

ABN , Publish Date - May 02 , 2026 | 05:59 AM

దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర ఒకేసారి రూ.1000 పెంచి.. మోదీ సర్కార్‌ సామాన్యుల నడ్డి విరుస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు.

పెంచిన వాణిజ్య సిలిండర్‌ ధర తగ్గించాలి : కేటీఆర్‌

దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర ఒకేసారి రూ.1000 పెంచి.. మోదీ సర్కార్‌ సామాన్యుల నడ్డి విరుస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. హైదరాబాద్‌లో 3,315 రూపాయలకు వాణిజ్యసిలిండర్‌ ధర అంటే రెస్టారెంట్లు, హోటళ్లు మూత వేసుకునే పరిస్థితి వస్తుందన్నారు. దీంతో వాటిలో పనిచేసే లక్షల మంది కార్మికుల ఉపాధికి ఇబ్బంది ఏర్పడిందని, ఇప్పటికే ఇరాన్‌-అమెరికా యుద్ధం పేరుతో హోటళ్లు, రెస్టారెంట్లలో పనిచేసే వారు, వాటిపై ఆధారపడిన వారి ఉపాధి తగ్గిపోతుందన్నారు. మే డే నాడు కార్మికులందరికీ ప్రధాని మోదీ ఇచ్చిన కానుక ఇదేనా? అని ప్రశ్నించారు. పెంచిన వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - May 02 , 2026 | 05:59 AM