సీఎం అసమర్థత వల్లే మెట్రో రెండో దశ వెనక్కి
ABN , Publish Date - Jun 16 , 2026 | 05:11 AM
సభలు, సమావేశాల్లో ప్రధాని మోదీని బడే భాయ్ అంటూ పొగిడే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయన్ను మెప్పించి మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు...
‘బడే భాయ్’ను మెప్పించలేని రేవంత్: కేటీఆర్
హైదరాబాద్, జూన్ 15(ఆంధ్రజ్యోతి): సభలు, సమావేశాల్లో ప్రధాని మోదీని బడే భాయ్ అంటూ పొగిడే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయన్ను మెప్పించి మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు ఎందుకు అనుమతి సాధించలేకపోయారో చెప్పాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అసమర్థత వల్లే మెట్రో రెండో దశ వెనక్కు వెళ్లిందని ఆరోపించారు. తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే రేవంత్ రెడ్డి ఇన్ని కుప్పిగంతులు వేస్తున్నారని ఒక ప్రకటనలో విమర్శించారు. మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వని కేంద్రాన్ని, ముఖ్యంగా ప్రధానిని విమర్శించే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదన్నారు. ఓటుకు నోటు కేసు ఉచ్చు బిగుస్తుందనే భయంతో బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకున్నారని, అందుకే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు.